Wednesday, 16 September 2026 11:26:29 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

తెప్పోత్సవం,ముక్కోటి మహోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలి : ఎస్పీ రోహిత్ రాజు

Date : 23 December 2025 06:15 PM Views : 290

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రోడ్డు ప్రమాదాల నియంత్రణ కొరకు నిత్యం వాహన తనిఖీలు చేపట్టాలి జిల్లా పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జిల్లాలోని పోలీసు అధికారులతో మంగళవారం నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల కాన్ఫరెన్స్ హాలు నందు అధికారులతో సమావేశమయ్యారు.ముందుగా పంచాయితీ ఎన్నికలలో మరియు వర్టీకల్స్ వారీగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు,సిబ్బందికి జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ నివారణా చర్యలను చేపట్టాలని సూచించారు.సంవత్సరం చివరలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా నిత్యం వాహన తనిఖీలు చేపడుతూ,మద్యం సేవించి వాహనాలను నడిపే వారిపై స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి ప్రమాదాలను నివారించడంలో ప్రతి ఒక్కరూ భాద్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు.అనంతరం అన్ని పోలీస్ స్టేషన్లలో నమోదైన పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి భాదితులకు న్యాయం చేకూర్చాలని తెలిపారు.పోక్సో కేసులలోని నిందితులకు త్వరతగతిన శిక్ష పడే విధంగా కృషిచేయాలని సూచించారు.గంజాయి అక్రమ రవాణా,మట్కా,క్రికెట్ బెట్టింగులు,కోడిపందాలు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు.అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రతి ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చేసి నేరాల నియంత్రణకు పాటుపడాలని అన్నారు.ఈ నెల 29,30 తారీఖులలో భద్రాచలంలో జరగనున్న తెప్పోత్సవం,ముక్కోటి ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్త్ ప్రణాళికను రూపొందించాలని సూచించారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇతర శాఖల సమన్వయంతో పకడ్బందీ బందోబస్తును ఏర్పాటు చేసుకోవాలన్నారు.వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పార్కింగ్ స్థలాల ఏర్పాటు,రూట్ మ్యాప్ లను ఏర్పాటు చేయాలని సూచించారు.పెట్రోలింగ్,బ్లూ కోల్ట్స్ వాహనాలతో నిత్యం రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలని సూచించారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.షీ టీమ్స్,భరోసా కేంద్రాల ఆవశ్యకత గురించి అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేసి భాధిత మహిళలకు అండగా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామీ,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్,ఐటీ సెల్ సీఐ రాము,ఇతర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :