తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ మండలం పుల్లాయిగూడెంలో నూతనంగా నిర్మించిన శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజల్లో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఆలయమర్యాదలతో ఆహ్వానం పలికిన అనంతరం అర్చకులు ఆయనతో పూజలు జరిపించారు. ఈ సందర్బంగా నాగా సీతారాములు మాట్లాడుతు అనేక వ్యయప్రయాసలకు ఓర్చి ఆలయ నిర్మాణం జరిపిన ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. రేపు జరగనున్న దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టకు భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు నాగా సీతారాములు ను పట్టు శాలువాతో సత్కరించి సన్మానించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు నూకల రంగారావు,45వ డివిజన్ కార్పొరేటర్ దంతెబోయిన నరేష్, కొత్తగూడెం పట్టణ ఓబీసీ అధ్యక్షులు జయప్రకాష్,ఓబీసీ నాయకులు ఆవుల మధు,యువజన కాంగ్రెస్ నాయకులు భరత్ మరియు దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు , గ్రామ పెద్దలు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ