తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : దమ్మపేట మండలంలో జరగనున్న విద్యుత్ సబ్‌స్టేషన్‌ల శంకుస్థాపన కార్యక్రమాలను పురస్కరించుకుని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మండలఅధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు ఈ నెల 15వ తారీఖు బుధవారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళిక మరియు విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క దమ్మపేట మండలం జగ్గారం, మల్లారం గ్రామాలలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్‌ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో స్థల పరిశీలనతో పాటు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ