Sunday, 02 August 2026 04:11:01 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

జాతీయ రహదారి పక్కన డ్రైనేజీ నిర్మాణాన్ని చేపట్టండి : కార్పొరేటర్ ముని గడప పద్మ

Date : 17 April 2026 04:55 PM Views : 317

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డ్రైనేజీ పై ఉన్న ఆక్రమణలు తొలగించి నేషనల్ హైవే పైకి నీళ్లు రాకుండా చూడాలి డి ఈ రవి కుమార్ కి సమస్యను వివరిస్తున్న కార్పొరేటర్ ముని గడప పద్మ కొత్తగూడెం కార్పొరేషన్ రామవరం నుండి విజయవాడ వైపు వెళ్లే జాతీయ రహదారిపై డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ అధికారులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం స్థానిక డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ విజ్ఞప్తి మేరకు డివిజన్లో ఉన్న సైడ్ డ్రైనేజీలు, కల్వర్టులు, కిన్నెరసాని మంచినీటి సమస్యలపై పర్యటించి వాటి పరిష్కార మార్గాన్ని చూపించాలని కోరిన వెంటనే స్పందించిన డి ఈ రవికుమార్ 16వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా నేషనల్ హైవే పక్కన సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్ నుండి పాత డ్రైనేజీ మొత్తం పుడుకపోయి, ఆక్రమణలకు గురై చిన్న వర్షం పడితే ఒక చెరువు లాగా జాతీయ రహదారి మారిపోతుందని అధికారులకు వివరించారు. శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఎక్కడ ప్రజలకు సమస్య ఉంటే అక్కడ నిధులు మంజూరు చేయిస్తారని అధికారులకు తెలిపారు. తక్షణమే ఈ రహదారి పక్కన డ్రైనేజీ నిర్మాణాన్ని చేపట్టాలని ఆమె కార్పొరేషన్ అధికారులకు విజ్ఞప్తి చేశారు .అలాగే మార్కెట్ వెనకాల ఒక 10 గృహాలకు సంబంధించిన ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు సైడ్ డ్రైనేజీ నీరు బయటికి రాకుండా ఆక్రమణకు గురిచేసి ఒకవైపు మున్సిపల్ రూము, మరొకవైపు ప్రైవేట్ రూము కట్టడంతో డ్రైనేజీ నీరు మునిగిపోయి పురుగులు ఆ గృహాలకు వ్యాప్తిస్తున్నాయని తెలిపారు. తక్షణమే ఈ డ్రైనేజీ నీరు బయటకు వచ్చే మార్గాలను అన్వేషించాలని ఆమె అధికారులను కోరారు. ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపించాలని ఆమె అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆక్రమణదారులకు నష్టం జరగకుండా ముందస్తుగా వారికి నోటీసులు అందించి, కాలువ నిర్మాణాన్ని చేపట్టి జాతీయ రహదారిపై నీళ్లు నిలవకుండా చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన డి ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు ఆమె తెలిపారు. అలాగే డివిజన్లో 8 కల్వర్టుల నిర్మాణాన్ని చేపట్టాలని ,కిన్నెరసాని మంచినీటి పథకంలో ఏర్పడుతున్న అమంతురాలను అధిగమించి మంచినీటిని అందించాలని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సైడ్ డ్రైనేజీని పరిశీలించిన వారిలో నాయకులు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు, ఏ ఈ బి శ్రీకాంత్ ,వర్క్ ఇన్స్పెక్టర్ కలాం తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :