తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు 35 వార్డులో పీఎం శ్రీ కూలి లైన్ ప్రభుత్వఉన్నత పాఠశాల మొదటి వార్షికోత్సవం లో తాజా మాజీ 35 వార్డ్ కౌన్సిలర్ రుక్మాంగదర్ బండారి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బండారి మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థుల ను ద్దేశించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేది విద్యనే అని ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యంపై దృష్టి సారించి గమ్యాన్ని చేరుకోవాల్సింది గా బండారి కోరారు.ప్రధానోపాధ్యాయులు బి.లాల్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఉపాధ్యాయుల కృషితో తల్లిదండ్రుల తోడ్పాటు ఉంటే అద్భుతాలను సృష్టిస్తారని అన్నారు.అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మునిగ సుజాత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని బడీడు పిల్లలను బడికి పంపించాలని కోరారు.మొదటి వార్షికోత్సవం కార్యక్రమంలో భాగంగా కూలీ లైన్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా బెస్ట్ స్టూడెంట్స్, బెస్ట్ ఫెర్ఫార్మన్స్, అటెండెన్స్ ఈ మూడింటిలో మంచి ప్రతిభ కనబరి చిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు మరియు మూమెంట్ లు, సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది. విద్యార్థిని విద్యార్థులకు సాంస్కృతి కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మరియు తాజా మాజీ కౌన్సిలర్ రుక్మాంగాధర్ బండారి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మునగ సుజాత, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు లాల్ సింగ్ దేవిలాల్ ఊహ రామారావు హరిబాబు స్పందన మరియు విద్యార్థిని విద్యార్థులు పేరెంట్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ