తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఐక్య తల్లిదండ్రుల సంఘం,ఎస్ జీ ఎఫ్ సంయుక్త ఆధ్వర్యలో సోమవారం రాత్రి భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కేంద్రం లో దిక్కు మొక్కు లేని వారికి వణికించే చలి లో రగ్గులు అందజేశారు. యూ పీ ఏ రాష్ట్ర అధ్యక్షులు మారుతి రత్నాకర్, ఎస్ జీ ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లోగాని శ్రీనివాస్ సారథ్యంలో కీర్తిశేషులు కొప్పుల పోలిరెడ్డి, సామ్రాజ్యం దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు కొప్పుల శ్రీనివాసరెడ్డి, హైమావతి దంపతులు సహకారం తో చలికి వణుకుతున్న అభాగ్యులకు, ఫుట్ పాత్ పై, బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతం లో నిద్రించే వీధిభిక్షకులకు రగ్గులు వితరణగా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జీ.లతా రవిచంద్ర, కోటేశ్వరరావు, కొప్పులశ్రీ భవ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రోజు మోహన్, ఏ టీ ఈ సీ జిల్లా ప్రధాన కార్యదర్శి నేమిల్ల రమేష్, ఎస్ జీ ఎఫ్ ఉమెన్స్ గిల్డ్ జిల్లా కమిటీ సభ్యురాలు అంజమ్మ, చుంచుపల్లి మండల ప్రధాన కార్యదర్శి నీరుకొండ మాలతి, జిల్లా ఉపాధ్యక్షుడు బీర రవీంద్రనాథ్, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ