తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డబుల్ బెడ్ రూముల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలి.డబుల్ బెడ్ రూమ్ లకు నిధులు కేటాయించాలి.సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు డిమాండ్.పాత కొత్తగూడెంలో గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబల్ బెడ్ రూమ్ ల నిర్మాణానికి అదనపు నిధులు కేటాయించి నిర్మాణాలను పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందించాలని మాజీ సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం డివిజన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో డబల్ బెడ్రూంల నిర్మాణాన్ని చేపట్టి నిర్మాణాలు పూర్తి కాకుండానే లబ్ధిదారులను నిర్ణయించడం జరిగిందని ఉన్నారు. ఇది ఆనాడు ఓట్ల కోసం ప్రభుత్వం చేసిన మోసంగా పరిగణించక తప్పదని ఆయన విమర్శించారు. 2016లో పాత కొత్తగూడెంలో ఎనిమిది వందల 26 డబుల్ బెడ్ రూమ్ లను నిర్మాణాన్ని ప్రారంభించారని, అందులో కనీసం 200 గృహాలు కూడా పూర్తి కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం ఆరోజు హడావుడిగా నిర్మాణాలు పూర్తి కాకుండానే డ్రా తీయడం జరిగిందని అన్నారు. లబ్ధిదారులకు ఎలాంటి మంజూరు పత్రాలు ఇవ్వకుండానే మోసం చేశారని ఆయన విమర్శించారు. అప్పుటి నుండి ఇప్పటికి నిర్మాణాలు పూర్తికాక ఇటు 75 గజాల స్థలం కు, ఇందిరమ్మ గృహాలకు లబ్ధిదారులను అనరులుగా తెల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూమ్ల నిర్మాణం పూర్తికాక, ఇటు ఇందిరమ్మ గృహాలు మంజూరు కాక, సంకట స్థితిలో డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు తక్షణమే ప్రభుత్వం స్పందించి వీటికి నిధులను కేటాయించాలని, అప్పుడు డ్రాలో అర్హులైన లబ్ధిదారులకు డబల్ బెడ్రూంలు కేటాయించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అందులో అనర్హులు ఉంటే వాటి వరకే ఆ జాబితా నుండి తొలగించాలే తప్ప మొత్తానికి మల్ల డ్రా తీస్తామంటే అనేకమంది పేదవారికి అన్యాయం జరిగే ప్రమాదం ఉందని తక్షణమే వాటికి నిధులు కేటాయించి, అప్పుడు డ్రా తీసిన అర్హులైన వారికే డబుల్ బెడ్ రూమ్ కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో నాయకులు ఓం నారాయణ, గడిదాసు కుమార్, బత్తుల పద్మ, గౌస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ