Wednesday, 04 November 2026 05:22:55 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

యువత నైపుణ్యాభివృద్ధికి మైలురాయిగా నిలుస్తున్న ATC- జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్

Date : 21 August 2025 04:42 PM Views : 738

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బూర్గంపాడు మండలంలోని ఐటీఐ కృష్ణసాగర్ వద్ద ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ (ATC) ను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆధునిక పరికరాలు, శిక్షణా ల్యాబొరేటరీలు, వర్క్‌షాప్ విభాగాలు మరియు తరగతి గదులను పరిశీలించారు. తరగతి గదిలో ఉన్న విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థులు పొందుతున్న శిక్షణ, సదుపాయాలపై స్పందనలు అడిగి తెలుసుకుని, మరింత కృషి చేసి మంచి అవకాశాలు సాధించాలని సూచించారు. విద్యార్థులు నేర్చుకుంటున్న పాఠ్యాంశాలు, ప్రాక్టికల్ శిక్షణ పద్ధతులు, భవిష్యత్తు ప్రణాళికల గురించి ప్రశ్నలు అడిగి వారిని ప్రోత్సహించారు. కలెక్టర్ మాట్లాడుతూ – ATC వంటి ఆధునిక శిక్షణా కేంద్రాలు యువతలో నైపుణ్యాలు పెంపొందించి భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను విస్తరించడానికి ఎంతో ఉపయోగపడతాయి అని అన్నారు. తరగతి గదుల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, స్మార్ట్ బోర్డులు, డిజిటల్ లెర్నింగ్ సిస్టమ్స్ ద్వారా విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ పొందుతున్నారు అని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే స్థాయికి ఎదగాలి అని పిలుపునిచ్చారు. ప్రభుత్వం యువత నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి మరియు ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. ATC వంటి శిక్షణా కేంద్రాలు ఈ దిశగా మైలురాయిగా నిలుస్తాయని ఆయన అన్నారు. ఈ కేంద్రంలో మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫాక్చరింగ్, ఆర్టిసన్ యూజింగ్ అడ్వాన్స్‌డ్ టూల్, బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైయర్, అడ్వాన్స్‌డ్ CNC మెషినింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ వంటి ఆధునిక కోర్సులు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. ఒక్కో కోర్సుకు 20 నుండి 40 సీట్ల వరకు, ఒకటి నుండి రెండు సంవత్సరాల వరకు వ్యవధి కల్పించబడిందని తెలిపారు. కనీస అర్హత పదవ తరగతి ఉత్తీర్ణత అయివుండాలని తెలిపారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది, విద్యార్థులు మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :