Thursday, 17 September 2026 07:37:13 PM
# శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్

పురోగతిపై సంతృప్తి.. మరింత కృషి దిశగా పయనించాలని ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి అదేశాలు.

Date : 03 March 2025 06:53 PM Views : 1060

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎక్సైజ్‌ అధికారుల నుంచి కానిస్టేబుల్‌ వరకు పోలీసులకు దీటుగా పని చేసిడిపార్టుమెంట్‌కు మంచి పేరు తీసుక రావాలని ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విబికమలాసన్‌రెడ్డి అన్నారు. సోమవారంఖమ్మం,కొత్తగూడెం, పెద్దపల్లి,కాగజ్‌నగర్‌, నిర్మల్‌ ప్రాంతాలకు చెందిన 86 మందికి ఎక్సైజ్‌ అధికారుల నుంచి కానిస్టేబుల్‌ వరకు డైరెక్టర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి చేతుల మీదుగా క్యాష్‌ అవార్డులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమం ఎక్సైజ్‌శాఖ (అబ్కారీ భవన్‌) సమావేశ మందిరంలో జరిగింది. తెలంగాణలో ఎక్సైజ్‌శాఖ పట్టుకుంటున్న గంజాయిలో 90 శాతం గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం , ఖమ్మం జి ల్లాలో పట్టుకోవడం అనందంగా ఉంద`న్నారు. ఏఓబీ నుంచి వస్తున్న గంజాయిని పట్టుకోవడంతో పాటు ఇతర మార్గాల్లో కూడ గంజాయి తరలివెలుతున్న మార్గాలను కనిపెట్టాలన్నారు. ఏపీ, ఒరిస్సాల్లో పండుతున్న గంజాయి దేశంలోని అన్ని ప్రాంతాలకు వెలుతుంద`ని అన్నారు. నేరస్థులకు శిక్షలు పడినపుడు నిందితులకు నేరం చేయాలంటే భయం వేస్తుందని అన్నారు. గంజాయిని పట్టుకున్నప్పుడు పంచనామా నుంచి కేసు ట్రయల్‌, శిక్షణలు పడేవిధాంగా చార్జీషీట్స్‌ రాయాలని సూచించారు. ప్రస్తుతం ఎక్సైజ్‌ శాఖ పని తీరు బాగుందని, మరింతగా కృషి చేసి ప్రభుత్వం అదేశించిన రీతిలో గంజాయి, డ్రగ్స్‌ను లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేయాలన్నారు. ఖమ్మం, కొత్తగూడంలో 72 మందికి, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ నుంచి 8 మందికి, కాగజ్‌నగర్‌, నిర్మల్‌ నుంచి 3 ముగ్గురికి, అపరేషన్‌ ధూల్‌పేట్‌లో భాగంగా ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ నంద్యాల అంజి రెడ్డి, సీఐలు మదుబాబు, గోపాల్‌ నగదు రివార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌తోపాటు జాయింట్‌ కమిషనర్‌ ఖురేషి, కరీంనగర్‌, ఖమ్మం డిప్యూటి కమిషనర్లు డేవిడ్‌ రవికాంత్‌, జనార్ధన్‌రెడ్డి అసిస్టేంట్‌ కమిషనర్లు ప్రణవీ, గణేష్‌లతోపాటు ఎక్సైజ్‌ సూపరిండెట్లు నంద్యాల అంజి రెడ్డి, పెద్దపల్లి, నిర్మల్‌ మహిపాల్‌, రజాక్‌, ఏఈఎస్‌లు తిరుపతి, కరమ్‌చంద్‌ పాల్గొన్నారు. ఏ సి గణేష్,సీఐ రహిమ్‌ఉన్నిషా బేగం, హెడ్‌ కానిస్టేబుల్‌ రహిమ్‌ లను డైరెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :