Friday, 18 September 2026 07:14:07 PM
# ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 15 June 2026 08:08 PM Views : 154

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. రెండవ ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుపై సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, గృహనిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రెండో విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఇందుకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న పూరి గుడిసెలు, నివాసయోగ్యం కాని ఇళ్లు, వివరాలను సేకరిస్తూ నిర్వహిస్తున్న సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో చేపడుతున్న పరిశీలనల్లో పారదర్శకత, నిష్పాక్షికత పాటించి అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనం అందేలా చూడాలని సూచించారు.సమావేశంలో మండలాల వారీగా నియమించిన పరిశీలన అధికారుల సంఖ్య, వారి పనితీరు, క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహిస్తున్న విధానంపై సమగ్రంగా చర్చించారు. ఇంటింటికీ వెళ్లి అర్హుల వివరాలను నమోదు చేయడం, భౌతిక పరిశీలన నిర్వహించడం, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక చేపట్టడం వంటి అంశాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వే ప్రక్రియను నిర్దేశిత గడువులో పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.అదేవిధంగా మండలాల వారీగా ఆధార్ నవీకరణ కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలపై కూడా సమీక్ష నిర్వహించారు. ఆధార్ నవీకరణ ప్రక్రియను వేగవంతం చేసి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు గృహ వసతి కల్పించడమే లక్ష్యమని, అధికారులు సమన్వయంతో పనిచేసి పథకం అమలును విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు .ఈ సమావేశం లో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, గృహ నిర్మాణ శాఖాధికారి సవేరామ్, ఎంపీడీవోలు, గృహ నిర్మాణశాఖ ఏ ఈ లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :