తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దుమ్ముగూడెం మండలం పర్ణశాల రైతు వేదికలో మంగళవారం సహజ వ్యవసాయం పై ఒకరోజు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులకు సహజ వ్యవసాయం పద్ధతులు, ప్రయోజనాలు, ఖర్చు తగ్గింపు, నేల ఆరోగ్యం పరిరక్షణ వంటి అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న రైతులకు అవసరమైన కిట్లను పంపిణీ చేశారు. రైతులు సహజ వ్యవసాయాన్ని స్వీకరించి స్థిరమైన వ్యవసాయం వైపు అడుగులు వేయాలని ఆయన సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ