తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో దాడి. ఒక రోడ్డు వేస్తుండగా కొన్ని చెట్లు కట్ కావడం తో వాటి గురించి కేసు నమోదు చేయకుండా ఉండేందుకు భద్రాచలం అటవీ శాఖ ఎఫ్ డి ఓ సుజాత రూ పది లక్షలు డిమాండ్ చేసి గురువారం రూ 3.5 లక్షలు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డి ఎస్పీ వై రమేష్ ఆధ్వర్యంలో ఆమెను, చర్ల ఇంచార్జ్ డి ఆర్ ఓ కృష్ణయ్య ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతం లో రోడ్డు వేస్తుండగా పొరపాటున చెట్లు దెబ్బ తిన్నాయి ఈ ఎపిసోడ్ లో ఎఫ్ డి ఓ సుజాత పది లక్షలు డిమాండ్ చేసి భద్రాచలం కార్యాలయం లో లంచం తీసుకుంటు డి ఆర్ ఓ తో పాటు పట్టుబడ్డారు.గతం లో కూడా కొత్తగూడెం అటవీ అభివృద్ధి సంస్థ జిల్లా అధికారి మూడున్నర లక్షలు లంచం తీసుకుంటు పట్టుబడ్డారు. అటవీ శాఖ లో అవినీతి పేరుకుపోయింది.
Admin
తెలుగు వెలుగు టీవీ