Thursday, 17 September 2026 11:50:26 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

సమ్మె నోటీసు ప్రభావంతో దిగివచ్చిన సింగరేణి యాజమాన్యం.చరిత్ర తిరగరాసిన గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ.

Date : 28 August 2026 05:38 PM Views : 146

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చరిత్ర తిరగరాసిన గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ.సమ్మె నోటీసు ప్రభావంతో దిగివచ్చిన సింగరేణి యాజమాన్యం.ఏఐటీయూసీ ఒత్తిడితో కార్మికుల పలు కీలక డిమాండ్లపై అంగీకారం కీలక ఒప్పందాలు.కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత కోసం గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ చేపట్టిన నిరంతర పోరాటం మరో కీలక విజయాన్ని సాధించింది. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జూన్ 8న ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసుపై యాజమాన్యంతో పలుమార్లు ఆర్‌ఎల్‌సీ సమక్షంలో చర్చలు జరిగాయి. ఈ చర్చల అనంతరం గురువారం జరిగిన కీలక చర్చల్లో సింగరేణి యాజమాన్యం పలు ప్రధాన డిమాండ్లపై సానుకూలంగా స్పందించి పలు కీలక ఒప్పందాలకు అంగీకరించింది.కార్మికుల న్యాయమైన డిమాండ్లపై ఏఐటీయూసీ కొనసాగించిన ఒత్తిడి, పోరాటం ఫలితంగానే యాజమాన్యం దిగివచ్చి ఈ నిర్ణయాలు తీసుకుందని ఏఐటీయూసీ నాయకులు తెలిపారు.ప్రధానంగా కుదిరిన కీలక ఒప్పందాలు.1.పెర్క్స్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్‌ను యాజమాన్యం భరించేందుకు అంగీకారం కోల్ ఇండియాలో అమలవుతున్న విధానానికి అనుగుణంగా సింగరేణి కార్మికులకు లభించే అలవెన్సులు, పెర్క్స్‌పై విధించే ఇన్‌కమ్ ట్యాక్స్‌ను యాజమాన్యం చెల్లించే విధంగా అంగీకరించింది. ఇది సింగరేణి కార్మికులకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం చేకూర్చే నిర్ణయంగా ఏఐటీయూసీ పేర్కొంది.2.సర్వీసులో సహజ మరణం పొందిన కార్మికుడి కుటుంబానికి ₹20 లక్షలు సర్వీసులో ఉండగానే సహజ మరణం పొందిన కార్మికుడి కుటుంబానికి ₹20 లక్షలు అందించేందుకు యాజమాన్యం అంగీకరించింది. గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ఒత్తిడితో ఈ నిర్ణయం తీసుకోవడం సింగరేణి చరిత్రలో ఒక ముఖ్యమైన పరిణామమని యూనియన్ పేర్కొంది.3.ప్రతి నెల మెడికల్ బోర్డు కార్మికుల మెడికల్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహించేందుకు యాజమాన్యం అంగీకరించింది.4.2025–26 వాస్తవ లాభాల ప్రకటన 2025–26 ఆర్థిక సంవత్సరంలో సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలను దసరాలోపు ప్రకటించేందుకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు తీసుకుని చర్యలు చేపడతామని యాజమాన్యం తెలిపింది.5.ట్రాన్స్‌ఫర్లలో మూడు సంవత్సరాల నిబంధన తొలగింపు ట్రాన్స్‌ఫర్లకు సంబంధించి అమలులో ఉన్న మూడు సంవత్సరాల సర్వీస్ నిబంధనను తొలగించి, ఖాళీల ఆధారంగా ఒక సంవత్సరం నిబంధనతో ట్రాన్స్‌ఫర్లు చేపట్టేందుకు యాజమాన్యం అంగీకరించింది.6.సీనియర్ మైనింగ్ స్టాఫ్‌కు ఓవర్నెన్ ప్రమోషన్లు మైనింగ్ స్టాఫ్‌లో సీనియర్ MSలుగా పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగులకు సకాలంలో ఓవర్నెన్ ప్రమోషన్లు కల్పించేందుకు యాజమాన్యం అంగీకరించింది.7.మారుపేర్ల సమస్యకు కమిటీ మారుపేర్లకు సంబంధించిన సమస్యపై ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటిస్తూ కమిటీ ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం తెలిపింది. ఈ కమిటీలో యూనియన్ సంఘాలకు కూడా భాగస్వామ్యం కల్పించినట్లు వెల్లడించింది.8.హైదరాబాద్‌లో సింగరేణి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హైదరాబాద్‌లో సింగరేణి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేసే అంశంపై యాజమాన్యం అంగీకారం తెలిపింది.9.22 ఏళ్లుగా మారని మెడికల్ అటెండెన్స్ రూల్స్‌లో మార్పులు దాదాపు 22 సంవత్సరాలుగా మార్పులేని మెడికల్ అటెండెన్స్ నిబంధనలను సవరించేందుకు యాజమాన్యం అంగీకరించింది.10.దిగిపోయిన కార్మికులకు వారం రోజుల చికిత్స సర్వీసు నుంచి దిగిపోయిన కార్మికులకు ఓపీ సేవలతో పాటు వారం రోజుల వరకు చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకోవడానికి యాజమాన్యం అంగీకరించింది.11.సింగరేణి విద్యాసంస్థల్లో CBSE సిలబస్ సింగరేణి పరిధిలోని విద్యాసంస్థల్లో పూర్తిస్థాయిలో CBSE సిలబస్ అమలు చేసే అంశంపై యాజమాన్యం సానుకూలంగా స్పందించింది.12.భద్రతా సామగ్రి సకాలంలో అందుబాటులోకి గనుల్లో కార్మికుల భద్రతకు సంబంధించిన అవసరమైన సేఫ్టీ మెటీరియల్‌ను సకాలంలో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామని యాజమాన్యం తెలిపింది.13.మందమరి–క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో 9% HRA మందమరి–క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు 9 శాతం HRA అందించే అంశంపై యాజమాన్యం అంగీకరించింది.14.డిస్మిస్ కార్మికుల పెండింగ్ కేసుల పరిష్కారం నాగాల కింద కింద సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న డిస్మిస్ కేసులను పరిష్కరించేందుకు యాజమాన్యం అంగీకరించింది.HPC కమిటీ ద్వారా ఇవ్వటానికి అంగీకరించారు.15.మైనింగ్ స్టాఫ్‌కు సూటబుల్ సర్ఫేస్ ఉద్యోగాలు మెకానికల్, ఎలక్ట్రికల్, అండర్‌గ్రౌండ్ మైనింగ్ స్టాఫ్‌లో జనరల్ అసిస్టెంట్‌గా ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిశీలించి, అర్హతలకు అనుగుణంగా సర్ఫేస్‌లో సూటబుల్ జాబ్ కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని యాజమాన్యం తెలిపింది.16.కాంట్రాక్ట్ కార్మికులందరికీ ESI వైద్యం సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ ESI వైద్య సదుపాయం అందేలా చర్యలు తీసుకుంటామని యాజమాన్యం అంగీకరించింది. 17.డిపెండెంట్ ఉద్యోగాల పెండింగ్ కేసుల పరిష్కారం పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాల కేసులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని యాజమాన్యం తెలిపింది.18.ఉద్యోగులకు ఈవెనింగ్ కాలేజీలకు NOC సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులు సాంకేతిక విద్యను కొనసాగించేందుకు ఈవెనింగ్ కాలేజీల్లో చదువుకోవడానికి అవసరమైన NOCలు జారీ చేసేందుకు యాజమాన్యం అంగీకరించింది.19.ఖాళీ పోస్టుల భర్తీసింగరేణిలో ఖాళీగా ఉన్న క్లారికల్, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, పారామెడికల్, S&PC సెక్యూరిటీ గార్డులు, ఎలక్ట్రికల్ సూపర్వైజర్లు, మెకానికల్ సూపర్వైజర్లు తదితర పోస్టుల భర్తీకి చర్యలు తీసుకునేందుకు యాజమాన్యం అంగీకరించింది.20.క్యాడర్ స్కీమ్ సమస్యల పరిష్కారం EP ఫిట్టర్లు, SDL ఆపరేటర్లు , సర్వేయర్లు, తదితర క్యాడర్ స్కీమ్‌కు సంబంధించిన సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని యాజమాన్యం తెలిపింది. 21.149 మంది మెడికల్ ఫిట్ డిపెండెంట్లకు ఆఫీస్ ఆర్డర్లు మెడికల్ ఫిట్ అయినప్పటికీ పెండింగ్‌లో ఉన్న 149 మంది డిపెండెంట్లకు నెల రోజుల్లోపు ఆఫీస్ ఆర్డర్లు జారీ చేసేందుకు యాజమాన్యం అంగీకరించింది.22.సొంత ఇంటి పథకంకార్మికులకు సొంత ఇంటి పథకంఅమలుకు ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని యాజమాన్యం తెలిపింది. ఇతర ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న మాదిరిగా చేయుటకు అంగీకరించారు,23.చట్టబద్ధంగా జరిగిన సమ్మెలో కాంటాక్ట్ కార్మికులు పాల్గొంటే వారికి నో వర్క్ నో పే అమలు చేస్తారు. వీరికి ఫైన్లు వర్తించవు.కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసు, ఆర్‌ఎల్‌సీ సమక్షంలో జరిగిన చర్చలు, యాజమాన్యంపై కొనసాగించిన నిరంతర ఒత్తిడి ఫలితంగానే పలు కీలక అంశాలపై యాజమాన్యం అంగీకారానికి వచ్చిందని ఏఐటీయూసీ నాయకులు తెలిపారు.పెర్క్స్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్, సర్వీసులో సహజ మరణం పొందిన కార్మికుడి కుటుంబానికి ₹20 లక్షలు, మెడికల్ బోర్డు ప్రతి నెల నిర్వహణ, లాభాల ప్రకటన, ట్రాన్స్‌ఫర్ నిబంధనల మార్పు, ప్రమోషన్లు, వైద్య సదుపాయాలు, ఖాళీ పోస్టుల భర్తీ, డిపెండెంట్ ఉద్యోగాలు తదితర అనేక కీలక సమస్యలపై సాధించిన ఈ అంగీకారాలు సింగరేణి కార్మికుల పోరాట చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి అని వారు పేర్కొన్నారు.ఈ చర్చల్లో ఎఐటియుసి గౌరవ అధ్యక్షులు కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు, ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య , డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు సారయ్య,వై వి.రావు,కందికట్ల వీరభద్రయ్య, మడ్డి ఎల్లయ్య, ముస్కే సమ్మయ్య,యాజమాన్యం తరుపున డైరెక్టర్ పా గౌతం పోట్రూ,జిఎం పర్సనల్ కిరణ్ కుమార్,అజయ్,జిఎం ఏం ఎస్ రవి,డిజిఎం రాజగోపాల్,ప్రభాకర్,తదితరులు పాల్గొన్నారు అనంతరం కేంద్ర కార్మిక ప్రాంతీయ కమిషనర్ కార్యాలయంలో ఏ ఎల్ సి శాశ్వతిరద్ సమక్షంలో అగ్రిమెంట్లు చేసుకున్న యాజమాన్యం మరియు గుర్తింపు కార్మిక సంఘం ఎఐటియుసి.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :