తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సెప్టెంబర్ 6,7,8 తేదీల్లో కరీంనగర్ లో జరిగే ఏఐటియూసి రాష్ట్ర 4వ మహాసభలను జయప్రథం చేయాలని ఏఐటియూసి జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక ఏఐటియూసి కార్యాలయం శేషగిరి భవన్లో మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంక్షేమ చట్టాను రద్దు చేసి పెట్టుబడి దారీ అనుకూ వర్గాలకు ఊడిగం చేసే విధంగా నాలుగు లేబర్ కోడ్లు ప్రవేశపెట్టారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో ప్రభుత్వరంగ సంస్థలు కనుమరుగు అవుతాయని, ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు లేకుండాపోయే ప్రమాదం ఉందన్నారు. పోరాడి సాధించుకున్న 8 గం.ల పనిదినం, సంక్షేమ చట్టాలు మొత్తం మసక బారుతున్నాయని అన్నారు. ఈ మహాసభల్లో కార్మిక సంక్షేమ చట్టాలను కొనసాగించుకునేందుకు కనీస వేతనాలను ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు ప్రైవేటీ కరణకు వ్యతిరేకంగా నిర్వహించే పోరాటాలను చర్చించనున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 750 మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరుకానున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కంచర్ల జమలయ్య, కార్యదర్శి నరాటి ప్రసాద్, కార్యదర్శులు జి నగేష్, భూక్య శ్రీనివాన్, జి వీరస్వామి రేను ఎల్లయ్య గుర్రం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ