Sunday, 02 August 2026 02:27:08 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ఔట్‌సోర్సింగ్ ఏఎన్‌ఎమ్‌లకు సబ్ సెంటర్ల కేటాయింపునకు కౌన్సెలింగ్ నిర్వహణ – జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. తుకారాం రాథోడ్.

Date : 06 July 2026 06:12 PM Views : 122

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని పలు ఆరోగ్య ఉప కేంద్రాల్లో రెగ్యులర్ ఏఎన్‌ఎమ్‌లు విధుల్లో చేరిన నేపథ్యంలో, ఖాళీగా ఉన్న ఉప కేంద్రాలకు ఔట్‌సోర్సింగ్ ఏఎన్‌ఎమ్‌లను కేటాయించేందుకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. తుకారాం రాథోడ్ మాట్లాడుతూ, కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, సీనియారిటీ మరియు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఉప కేంద్రంలో ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.నూతనంగా కేటాయించిన ఉప కేంద్రాల్లో ఔట్‌సోర్సింగ్ ఏఎన్‌ఎమ్‌లు వెంటనే విధుల్లో చేరి, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, శిశువులు, చిన్నారులకు అవసరమైన ఆరోగ్య సేవలు, టీకాల కార్యక్రమాలు, కుటుంబ నియంత్రణ సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.జిల్లాలోని ప్రతి ఆరోగ్య ఉప కేంద్రంలో ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా వైద్య సేవలు అందేలా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని డా. తుకారాం రాథోడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో రామకృష్ణ సూపర్డెంట్ డిప్యూటీడెమో నాగలక్ష్మి డిపిఎంవోమోహన్, హెల్త్ సూపర్వైజర్లు శ్రీనివాసరావు, రాంప్రసాద్, జానకి సుశీల ఉమాదేవి విజయలక్ష్మి యూనియన్ నాయకులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :