తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. బుధవారం రాత్రి 48 అడుగులు దాటడంతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాగా ఉదయం 10 గంటలకు నీటిమట్టం 51.10 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. ప్రవాహం ఇలాగే కొనసాగితే 53 అడుగుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. క్రమక్రమంగా నీటిమట్టం పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ