Wednesday, 16 September 2026 04:45:12 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

సాంకేతిక పరిజ్ఞానంతో భూ రీ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలి: కలెక్టర్ అంకిత్

Date : 11 September 2026 02:40 PM Views : 81

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాత రికార్డులు, మ్యాపుల ఆధారంగా భూ సరిహద్దుల కచ్చితమైన నిర్ధారణ సీఎస్‌ఆర్ నిధులతో రహదారి నిర్మాణానికి చర్యలు భూ రీ సర్వేలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి భూ సరిహద్దులను కచ్చితంగా నిర్ధారిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ రీ సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోవర్, ట్యాబ్ పరికరాలతో చేపడుతున్న డిజిటల్ సర్వే ప్రక్రియను పరిశీలించి పనుల పురోగతిని తెలుసుకున్నారు. డిజిటల్ విధానంలో సర్వే నిర్వహించడం వల్ల సమయం, సిబ్బంది ఆదా కావడంతో పాటు ట్యాబ్‌లో నమోదైన సమాచారాన్ని నేరుగా కంప్యూటర్, ఆటోక్యాడ్‌లోకి మార్చుకునే అవకాశం ఉందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అమ్మగారిపల్లి, కుమ్మగూడెం పరిధిలో కాడస్ట్రల్ మ్యాపులు, పాత రెవెన్యూ రికార్డుల ఆధారంగా సుమారు 1,900 ఎకరాలకు పైగా భూముల సరిహద్దులను నిర్ధారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 1920ల నాటి ఫసలీ రికార్డులతో పాటు బూర్గంపాడు తాలూకాకు సంబంధించిన పాత రికార్డులను పరిశీలిస్తున్నట్లు వివరించారు. మూడు తరాలుగా భూములను అనుభవిస్తున్నప్పటికీ రికార్డుల్లో ఉపవిభజనలు నమోదు కాకపోవడం వల్ల ఎదురవుతున్న సమస్యలను రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గోదావరి వరదలు, భూమి కోతల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పాత భూ సరిహద్దులు మారిపోయాయని, సీతారామ ప్రాజెక్టు పరిసరాల్లో కొన్ని చోట్ల సుమారు 250 మీటర్ల మేర మార్పులు చోటుచేసుకున్నట్లు అధికారులు వివరించారు. 57/1 తదితర సర్వే నంబర్లలో నీట మునక, ఇసుక మేటల కారణంగా పాత భూ గుర్తులు కనుమరుగైనట్లు తెలిపారు. కేఎంఎల్ ఫైళ్ల ఆధారంగా సుమారు 7.91 కిలోమీటర్ల మేర సరిహద్దులను గుర్తిస్తున్నామని, రోజుకు సుమారు 2 కిలోమీటర్ల చొప్పున సర్వే నిర్వహించి 2 నుంచి 4 రోజుల్లో పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. పాత రికార్డులను సమగ్రంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ రైతులకు భూములపై స్పష్టత కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ ప్రాంతంలో రహదారి నిర్మించాలని కలెక్టర్‌ను కోరగా, అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్ సీఎస్‌ఆర్ నిధులతో అవసరమైన మేరకు రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం తహసీల్దార్ సూర్యప్రకాష్, సర్వే అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, గ్రామస్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :