తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రముఖ మిమిక్రీ కళాకారుడు సీనియర్ జర్నలిస్ట్ మిమిక్రీ రమేష్ ఈ నెల 12వ తేదీన జాంబియా రాజధాని లుసా కాకు వెళ్లనున్నారు.. అక్కడి డ్రిల్లింగ్ కంపెనీస్ ఆధ్వ ర్యంలో నిర్వహించే గణేష్ ఉత్సవ కార్యక్రమానికి మిమి క్రీ రమేష్ కు ఆహ్వానం అందింది. ఈ నెల 13, 14 తేదీల్లో అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమాలకు మిమిక్రీ రమేశ్ తో పాటు నల్లగొండ గద్దర్ నరసన్న, రేలారే గంగలు కూడా వెళుతున్నారు.. అక్కడి జాంబియా క్యాపిటల్ సిటీ లూసాక లో అలీమార్ పార్క్, రోడ్స్ పార్క్ లో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.. 15వ తేదీన నిమజ్జనం కార్యక్రమం ఉంటుంది. తనను తోటి కళాకారులు నల్లగొండ గద్దర్ నరసన్న, గంగలను జాంబియా రాజధాని విశాఖకు ఆహ్వానించిన డ్రిల్లింగ్ కంపెనీస్ అధినేతలకు మిమిక్రీ రమేష్ కృతజ్ఞతలు తెలియజేశారు.. తొలిసారి జాంబియాకు వెళుతున్న మిమిక్రీ రమేష్ ను పలువురు ప్రముఖులు అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ