Friday, 18 September 2026 08:13:32 PM
# ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ.

Date : 27 July 2026 04:42 PM Views : 170

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం.పాత్రికేయవృత్తి ఎంతో సంతృప్తినిచ్చింది -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ.ఘనంగా 43 వసంతాల విజయోత్సవ వేడుక తెలుగువారి ఆరాధ్య దైవమైన శ్రీరాముడు కొలువై ఉన్న జిల్లాలో, భూమాత ప్రసాదించిన బొగ్గుకు పుట్టినిల్లయిన ఇల్లందులో జర్నలిస్టుగా పనిచేయటం ఎంతో అదృష్టం అని సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ అన్నారు. 1983లో ఇల్లందులో అడుగుపెట్టి జర్నలిస్టుగా వివిధ పత్రికల్లో పనిచేసిన సూర్యనారాయణ 43 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మిత్రులు, శ్రేయోభిలాషులు సోమవారం 43 సంవత్సరాల విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సూర్యనారాయణ మాట్లాడుతూ చిన్నప్పటినుండి తనకు జర్నలిజం అంటే చాలా ఇష్టమని పేర్కొంటూ తన పాత్రికేయ ప్రయాణం ఇల్లందులోనే ప్రారంభమైందని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి, సమాజానికి విశేషమైన సేవలు అందించడానికి ఎంతో బాధ్యతాయుతమైన పాత్రికేయవృత్తి తనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్ లోనే తన పాత్రికేయవృత్తి ప్రారంభమైందని, ఈ రెండు దినపత్రికలు తనను ఒక మంచి పాత్రికేయునిగా తీర్చిదిద్దాయని, ఈ విషయం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. వృత్తిలో ఎంతోమంది ప్రతిభావంతులైన జర్నలిస్టులతో కలిసి పనిచేసే అవకాశం తనకు లభించిందని, వృత్తిలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ, అంకితభావంతో విధులను నిర్వర్తించి ప్రజల ఆదరణ పొందటం ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. నాలుగు దశాబ్దాల క్రితం సమాజంలో జర్నలిస్టులు చాలా తక్కువ మంది ఉండేవారని, జర్నలిస్టుల పట్ల ప్రజలకు ప్రత్యేక గౌరవం ఉండేదని, అప్పట్లో జర్నలిస్టుగా చెప్పుకోవడం గర్వకారణంగా ఉండేదని అన్నారు. 1983లో ఇల్లందులో ఒక చిన్న మొక్కగా ఉన్న పాత్రికేయరంగం నేడు ఒక మహావృక్షంగా మారిందని ఆయన హర్షం వ్యక్తంచేశారు. సమాజంలో వృత్తినే దైవంగా భావించి సంవత్సరాల తరబడి పత్రికారంగంలో విశేష సేవలు అందించిన జర్నలిస్టులను గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. నేడు పత్రికారంగంలో సాంకేతిక విజ్ఞానం విశేషంగా అభివృద్ధి చెందిందని, ఎటువంటి వ్యయప్రయాసాలు లేకుండా జర్నలిస్టులు వార్తావిశేషాలను ప్రజలకు ఎప్పటికప్పుడు అందిస్తున్నారని ఆయన కొనియాడారు. కాలానుగుణంగా దినదినాభివృద్ధి చెందుతున్న పాత్రికేయరంగంలో అంకితభావంతో విధులను నిర్వర్తించి వృత్తి గౌరవాన్ని పెంచవలసిన బాధ్యత జర్నలిస్టులపై ఉందని అన్నారు. రానున్నకాలంలో మీడియారంగం ఉజ్వలమైన భవిష్యత్తు కలిగి ఉండాలని, జర్నలిస్టులకు ఎంతో మేలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సుదీర్ఘకాలంలో తనతో పనిచేసిన జర్నలిస్టులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :