తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రతా బలగాలతో పాటు సంయుక్తంగా నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్లలో మావోయిస్టులకు సంబంధించిన 06 డంప్ లను, 05 ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంలో సమర్థవంతంగా విధులను నిర్వర్తించిన జిల్లా బాంబు డిస్పోజల్ బృందం సభ్యులను ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.అదేవిధంగా భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఏర్పాటు చేసినటువంటి 10 ఐ.ఇ.డి లను కనుగొని వాటిని అత్యంత చాకచక్యంగా నిర్వీర్యం చేసిన బీడీ టీం సిబ్బందిని అభినందిస్తూ క్లిష్ట పరిస్థితులలో బీడీ టీం ప్రదర్శించిన సమయస్ఫూర్తి,ధైర్యసాహసాలు ఎంతో గర్వకారణమని కొనియాడారు.సిబ్బందికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పలు సూచనలు చేస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ అటవీ ప్రాంతాలలో తనిఖీలు చేసేటప్పుడు నిర్ణీత నిబంధనలను కచ్చితంగా పాటించాలని,స్వీయ రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచనలు చేశారు.నూతన ఉత్సాహంతో పనిచేస్తూ ప్రతిభ కనబరిచిన 12 మంది బీడీ టీం పోలీస్ సిబ్బందిని శుక్రవారం ఎస్పీ అభినందిస్తూ వారికి ప్రశంసా పత్రాలు,రివార్డులను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆర్ఐ ఆపరేషన్స్ రవి,BD టీం సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ