Monday, 03 August 2026 03:52:22 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 29 July 2026 06:31 PM Views : 40

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశంలో అధికారులకు ఆదేశాలు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలు, ప్రమాదాలు అధికంగా నమోదవుతున్న బ్లాక్ స్పాట్ల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రహదారులపై పశువుల సంచారం అధికంగా ఉండటం వల్ల, ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు . రహదారులపై పశువులను నిర్లక్ష్యంగా వదిలే యజమానులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అతివేగంగా వాహనాలు నడపడం, మైనర్లకు వాహనాలు అప్పగించడం, సీటు బెల్టులు ధరించకపోవడం, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు వినియోగించకపోవడం వంటి ఉల్లంఘనలను అరికట్టేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, కట్టుదిట్టమైన అమలు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 42 బ్లాక్ స్పాట్లలో భద్రతా చర్యలకు సంబంధించిన పనులను వచ్చే నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. బ్లాక్ స్పాట్ల వద్ద హెచ్చరికలు, సూచిక బోర్డులు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా రహదారుల వెంట ఏర్పడిన గుంతలను తక్షణమే పూడ్చివేయాలని, రహదారుల ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించి వాహనదారులకు స్పష్టమైన దృశ్యమానత కల్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలను వెంటనే చేపట్టాలని సూచించారు. ప్రమాదాలు సంభవించినప్పుడు క్షతగాత్రులకు 'గోల్డెన్ అవర్'లో సకాలంలో వైద్య సేవలు అందేలా బ్లాక్ స్పాట్లకు సమీపంలోని ఆసుపత్రులను మ్యాపింగ్ చేయాలని, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో జనవరి నుండి ఇప్పటివరకు 289 రోడ్డు ప్రమాద కేసులు నమోదయ్యాయని అధికారులు వివరించారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేసి నవీకరించాలని సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు వేణుగోపాల్, ఆర్ అండ్ బి ఈ ఈ నాగేశ్వరరావు, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణ, జిల్లా వైద్యశాఖ అధికారి తుకారాం రాథోడ్, జిల్లా పంచాయతీ అధికారి అనూష సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :