తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 3 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామంలో కె.ఆర్ యూత్ ఆధ్వర్యంలో అయ్యప్ప సెంటర్ నందు శరన్నవరాత్రి మొదటిరోజు పూజా కార్యక్రమాల లో భాగంగా కుంకుమ పూజ నిర్వహించారు . విగ్రహ దాత కంపసాటి వెంకటేశ్వర్లు, నాగమణి దంపతులు కు కమిటీ సభ్యులు అభినందనలు తెలియజేశారు. కమిటీ వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అయ్యప్ప సెంటర్ నందు దేవి నవరాత్రులు నిర్వహిస్తున్నామని ఆ దుర్గదేవీ కటాక్షంతో మా గ్రామానికి అంతా మంచే జరుగుతుందని అందుకనే ప్రతి ఏటా శరన్నవరాత్రి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని సంతోషాన్ని తెలియజేశారు. కమిటీ సభ్యులు సాయిన్నీ కొండయ్య, గుణ్ణం శెట్టి తిరుమలరావు, సాయి, కౌశిక్, సారంగిమల్లి, సతీష్, కోటి, నరి, గోవర్ధన్, నరసింహారావు, వినయ్, ప్రసాద్, ఉపేందర్ మరియు గ్రామస్తులు సహకారంతో....
Admin
తెలుగు వెలుగు టీవీ