తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గురువారం ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఈవీఎం గోడౌన్ను జిల్లా కలెక్టర్ అంకిత్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎంల భద్రతా ఏర్పాట్లపై ప్రతి నెలా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే గురువారం గోడౌన్ను పరిశీలించినట్లు తెలిపారు . తనిఖీలో భాగంగా సీసీ కెమెరాల నియంత్రణ గదిని సందర్శించి, కెమెరాల పనితీరు, రికార్డింగ్ వ్యవస్థలను పరిశీలించారు. గోడౌన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. అనుమతి లేని వ్యక్తులను గోడౌన్ పరిసరాల్లోకి అనుమతించరాదని భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లను పరిశీలించి సంతకం చేశారు.ఈ తనిఖీలో కొత్తగూడెం ఆర్ డి ఓ మధు,ఎన్నికల సూపరింటెండెంట్ రంగప్రసాద్, ఎన్నికల సిబ్బంది నవీన్, సంబంధిత అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ