Wednesday, 16 September 2026 06:01:23 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రీన్ ర్యాలీ..

Date : 05 June 2025 03:01 PM Views : 499

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయము, కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 న గ్రీన్ ర్యాలీని సింగరేణి మహిళా కళాశాల నుండి పోస్ట్ ఆఫీస్ సెంటర్ మరియు కొత్తగూడెం బస్టాండ్ మీదుగా ఐ.ఎం.ఏ హాల్ వరకు నిర్వహించినారు. ఈ యొక్క ర్యాలీని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐఏఎస్ మరియు బి . రవీందర్, పర్యావరణ ఇంజనీర్, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయము, కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో క్యాప్స్ మరియు నారసంచులను విడుదల చేసి ర్యాలీలో పాల్గొన్న వారందరికీ పంచడంతోపాటు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ యొక్క ర్యాలీలో కేటీపీస్ మరియు సింగరేణి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు, ఇతర ఉమ్మడి జిల్లా పరిశ్రమల ప్రతినిధులు, సింగరేణి కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 సందర్భంగా ప్రత్యేక ఉద్దేశ్యమైన "ప్లాస్టిక్ కాలుష్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా అంతం చేద్దాం' అనే అంశంపై అవగాహన సదస్సు ను శ్రీ బి. రవీందర్, పర్యావరణ ఇంజనీర్, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయము, కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో ఐ.ఎం. ఏ హాల్ నందు నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో ముందుగా పర్యావరణ ఇంజనీర్ బి. రవీందర్ మాట్లాడుతూ పర్యావరణ కాలుష్య నియంత్రణ చట్టాలు- జిల్లాలో వాటి అమలును, పరిశ్రమలు మరియు ప్రజలు వారి దైనందిన జీవితములో తీసుకోవలసిన పర్యావరణ హితమైన చర్యలు గురించి వివరించినారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించి వాటి బదులుగా నారా లేదా గుడ్డ సంచులను వాడాలని కోరారు. డా. పావని, అధ్యాపకురాలు సింగరేణి స్కూల్, కొత్తగూడెం, ప్రభాకర రావు మరియు శ్రీనివాస బాబు, చీఫ్ ఇంజనీర్స్, కేటీపీఎస్ వారు మాట్లాడుతూ పర్యావరణహితమైన చర్యలను గురించి మరియు RRR (Reduce, Reuse, Recycle) ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బి. రవీందర్, పర్యావరణ ఇంజనీర్ నారసంచులను విడుదల చేసి కార్యక్రమంలో పాల్గొన్న వారికి పంపిణీ చేయడం జరిగినది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం, కొత్తగూడెం వారి తరపున బి. రవీందర్, పర్యావరణ ఇంజనీర్, సి హెచ్. అజయ్ కుమార్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :