తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి .రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి ధాన్యం మిల్లింగ్ నిలిపివేత , బిల్లింగ్ సమయం లో ఏర్పడిన తరుగు మరియు ఎఫ్ సి ఐ ద్వారా బాయిల్డ్ రైస్ స్వీకరణకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి సానుకూల నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ కు వినతి పత్రం పై విషయాలకు సంబంధించి 7- 9- 2026 తేదీన జరిగిన రాష్ట్ర రైస్ మిల్లర్ల ప్రెస్ మీట్ లో తీసుకున్న నిర్ణయం మేరకు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని రైస్ మిల్లులు నేటి నుండి మిల్లింగ్ కార్యక్రమాలు నిలిపివేయాలని నిర్ణయించుకున్నాము.నిర్ణయం తీసుకోవటానికి ప్రధాన కారణాలు: బిల్లింగ్ ప్రక్రియలో ట్రాన్స్పోర్ట్ , నూకలు , పరమ ఇతర తరుగుదలలు కలిపి సుమారు 15% నుండి 20% వరకు తరుగు వస్తుందని , ఈ తరుగుదలను ఫిజికల్ వెరిఫికేషన్ సమయంలో సరైన విధంగా తీసుకోకపోవడం వల్ల రైస్ మిల్లర్స్ కు తీవ్ర ఆర్థిక నష్టం కలుగుతుందని , ఈ కారణంగా ప్రస్తుతం మిల్లింగ్ ప్రక్రియ కొనసాగించడం ఆర్థికంగా సాధ్యం కానీ పరిస్థితి ఏర్పడిందని ,ఎఫ్సీఐ ద్వారా బాయిల్డ్ రైస్ స్వీకరించకుండా రా రైస్ మాత్రమే ఇవ్వాలని సూచిస్తున్నప్పటికీ , మిల్లులకు కేటాయించబడుతున్న ధాన్యం రా రైస్ తయారీకి అనుకూలంగా లేకపోవడం వల్ల , దానిని రా రైస్ గా మిల్లింగ్ చేసి సరఫరా చేయటం సాధ్యం కాని పని పరిస్థితి నెలకొన్నదని ,పై సమస్యలకు తగిన పరిష్కారం లభించే వరకు మిల్లింగ్ కార్యక్రమాలు నిలిపివేయాలని జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ నిర్ణయించుకున్నది. అందువలన పై సమస్యలను దయచేసి సానుకూలంగా పరిశీలించి రైస్ మిల్లర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను తగిన పరిష్కారం చూపటంతో పాటు , ఎఫ్ సి ఐ ద్వారా బాయిల్డ్ రైస్ స్వీకరణ , మరియు మిల్లింగ్ కు సంబంధించిన ఇతర సమస్యలను తగిన చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాం . రైస్ మిల్లర్స్ సమస్యలను దయతో పరిశీలించి , తగిన న్యాయం చేయగలరని ఆశిస్తున్నాము.
Admin
తెలుగు వెలుగు టీవీ