Wednesday, 04 November 2026 11:11:38 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

కొత్తగూడెం అడ్వకేట్‌కు దక్కిన అరుదైన ఘనత. ఇందిరా ప్రియదర్శినికి కాళోజి నంది అవార్డు. జిల్లా కోర్టు పరిధిలో బెస్ట్ జూనియర్ అడ్వకేట్.

Date : 10 September 2026 05:15 PM Views : 284

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ???? ఇందిరా ప్రియదర్శినికి కాళోజి నంది అవార్డు.కొత్తగూడెం అడ్వకేట్‌కు దక్కిన అరుదైన ఘనత.హైకోర్టు న్యాయమూర్తి చేతుల మీదుగా పురస్కారం.జిల్లా కోర్టు పరిధిలో ‘బెస్ట్ జూనియర్ అడ్వకేట్’.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయవాద రంగానికి మరో విశిష్ట గౌరవం దక్కింది. జిల్లా కోర్టు పరిధిలో ప్రతిభ కనబరిచిన కొత్తగూడెం పట్టణం, ప్యూన్ బస్తీకి చెందిన అడ్వకేట్ ఇందిరా ప్రియదర్శిని "బెస్ట్ జూనియర్ అడ్వకేట్"గా ఎంపికయ్యారు. దీనితో పాటు కాళోజి జయంతి సందర్భంగా ప్రదానం చేసే ప్రతిష్టాత్మక "కాళోజి నంది అవార్డు"ను సైతం ఆమె దక్కించుకున్నారు. వరంగల్‌లోని కాళోజి ఆడిటోరియంలో బుధవారం రాత్రి నిర్వహించిన ప్రత్యేక సభలో హైకోర్టు న్యాయమూర్తి చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. న్యాయవృత్తిలో ఆమె చూపుతున్న నిబద్ధత, అంకితభావానికి రాష్ట్రస్థాయి గుర్తింపు లభించడం పట్ల జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య, పలువురు న్యాయవాదులు, పట్టణ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :