తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం పోలీస్ స్టేషన్ కు వాయువ్య దిశలో ఐదు కిలోమీటర్ల దూరంలోని మోతే గ్రామం అటవీప్రాంతంలో గురువారం ఎదురుకాల్పులలో భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు (బీ కే ఏ ఎస్ ఆర్ ) డివిజనల్ కమిటీకి చెందిన ఆరుగురు మావోయిస్టుల మృతి చెందారని జిల్లా ఎస్పీ బీ.రోహిత్ రాజు వెల్లడించారు. ఈ రోజు ఉదయం సుమారుగా 06.45 గంటలకు సాధారణ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు బలగాలకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.చట్టవిరుద్ధంగా ఆయుధాలు కలిగి ఉన్న నిషేధిత మావోయిస్టులు పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.కాల్పులను ఆపివేయాలని హెచ్చరించినా వారు ఆపకపోవడంతో ఆత్మరక్షణార్థం పోలీసులు కూడా తిరిగి కాల్పులు జరిపారు. మావోయిస్టుల నుండి కాల్పులు ఆగిన అనంతరం ఆ ప్రాంతాన్ని పోలీసులు సోదా చేయగా ఆలివ్ గ్రీన్ దుస్తులలో ఉన్న ఆరు మృతదేహాలను గుర్తించారు .ఘటనా స్థలంలో లభించిన ఆరు ఆరు మృతదేహాలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. రెండు ఏ కే 47,తుపాకులు, ఒక ఎస్ ఎల్ ఆర్ .ఒక 303 రైఫిల్ ఒక పిస్టల్ - దాని మ్యాగ్జిన్ తో పాటు లైవ్ రౌండ్లు,కిట్ బ్యాగులు, ఇతర సామాగ్రిని స్వాధీనపరుచుకున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ