తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి యాజమాన్యం వారు తేనెటీగల పెంపకంపై మనబ్ కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ, అగర్తల, వెస్ట్ త్రిపుర వారిచే ఉచిత శిక్షణ అందించి సంబంధిత పరికరాలతో ప్రోత్సహిస్తుందని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. కొత్తగూడెం సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు ఓ ప్రకటన ద్వారా కోరినట్లు చెప్పారు. జీకేఓసీ, వీకేఓసీ ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల నిర్వాసితులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. (పెనగడప, రామవరం, రుద్రంపూర్, ధన్ బాద్, గరీబ్ పేట్, పెనుబల్లి, రాంపురం, తిప్పనపల్లి, అంబేడ్కర్ నగర్, సీతంపేట, 3 ఇంకైన్, 4 ఇంకైన్, వనమా నగర్, ప్రశాంతి నగర్ ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి కలిగిన మహిళలు కొత్తగూడెం ఏరియా పర్సనల్ డిపార్ట్మెంట్లో ఈనెల 16వ తేదీ లోపు అప్లికేషన్లు అందించాలని పేర్కొన్నారు. అధిక వివరాలకు ఫోన్: 810681836 చేయాలన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ