Wednesday, 04 November 2026 04:40:42 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

కార్మికులు అనుభవించే ప్రతిహక్కు వెనుక కొమురయ్య త్యాగం ఉంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

Date : 05 September 2026 07:14 PM Views : 483

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ???? కార్మికోద్యమాలతోనే హక్కుల సాధన. పెన్షన్, బోనస్ సుదీర్ఘ పోరాట ఫలితమే. కార్మికులు అనుభవించే ప్రతిహక్కు వెనుక కొమురయ్య త్యాగం ఉంది. ఒప్పందాలపై దుష్ప్రచారం మానుకోవాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.ఘనంగా కొమురయ్య 30వ వర్ధంతి.సింగరేణి కార్మికుల సంక్షేమం, హక్కుల రక్షణ కోసం జీవితాంతం పోరాడిన యూనియన్ కొమరయ్య సేవలు చిరస్మరణీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కొమరయ్య 30వ వర్ధంతి సందర్భంగా శనివారం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఉన్న ఆయన విగ్రహంతో పాటు కొత్తగూడెం, కార్పొరేట్ ఏరియాల్లోని వివిధ గనులు, విభాగాల వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించి, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. కార్మికుల జీవితాల్లో నేడు అమలవుతున్న అనేక సంక్షేమ ఫలాలు కొమరయ్య వంటి నాయకుల త్యాగాల ఫలితమేనన్నారు. పదవీ విరమణ తర్వాత కార్మికులకు గౌరవప్రదమైన జీవనం అందించేందుకు రూ.350తో ప్రారంభమైన పెన్షన్ సాధించి ఆయన పెన్షన్ ప్రదాతగా నిలిచారని, దీపావళి బోనస్ హక్కుగా దక్కేలా పోరాడారని గుర్తుచేశారు. ఒకే సంస్థలో పనిచేసే కార్మికుల మధ్య వివక్ష ఉండకూడదనే ఉద్దేశంతో కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్ కోసం కృషి చేశారని పేర్కొన్నారు. ఆర్ఎల్సీ సమక్షంలో కుదిరిన కీలక ఒప్పందాలను జీర్ణించుకోలేక కొన్ని స్వార్థ కార్మిక సంఘాలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరే సంఘాలు విమర్శలు చేయడం సిగ్గుచేటని, కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే ఇలాంటి అసత్య ప్రచారాలను తక్షణమే మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సీనియర్ నాయకులు శేషయ్య, కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, ఏరియా బ్రాంచ్ కార్యదర్శులు జక్కుల గట్టయ్య, రమణమూర్తి, సుధాకర్, ఉపాధ్యక్షులు కత్తర్ల రాములు, క్రిస్టోఫర్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :