Thursday, 05 November 2026 01:57:39 AM
# సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు.

విద్యారంగ పరిరక్షణకు ఐక్య విద్యార్థి ఉద్యమం – AISF. తెలంగాణ రాష్ట్ర నిర్మాణ మహాసభల్లో భద్రాద్రి జిల్లా ప్రతినిధుల పిలుపు.

Date : 29 September 2026 07:39 PM Views : 138

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఐక్య విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని AISF భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వరక అజిత్ పిలుపునిచ్చారు. హన్మకొండలో నిర్వహించిన AISF తెలంగాణ రాష్ట్ర నిర్మాణ మహాసభల్లో జిల్లా ప్రతినిధి బృందం పాల్గొంది.ఈ సందర్భంగా అజిత్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయులు, లెక్చరర్ల ఖాళీలు, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, సంక్షేమ హాస్టళ్ల సమస్యలపై మహాసభల్లో చర్చించినట్లు తెలిపారు. పేద, మధ్యతరగతి విద్యార్థులపై ఆర్థిక భారం పెరగకుండా ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు, హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు ఖాళీలను భర్తీ చేయాలని, పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రామీణ, గిరిజన విద్యార్థుల సమస్యలపై పోరాటాన్ని మరింత విస్తృతం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో AISF జిల్లా సహాయ కార్యదర్శులు గుండాల సుజన్, మాణిక్యాల వినయ్, శ్యామల, ఉమామహేష్, జిల్లా ఉపాధ్యక్షులు సంజయ్, నాయకులు జుంజునూరి రాజ్‌కమల్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :