Thursday, 17 September 2026 07:33:53 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

రైతులకు స్థిర ఆదాయానికి సమీకృత వ్యవసాయం ఉత్తమ మార్గం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 02 February 2026 07:59 PM Views : 237

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రైతులకు స్థిరమైన, నిరంతర ఆదాయం సాధించేందుకు సమీకృత వ్యవసాయ విధానం ఉత్తమ మార్గమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని లోతువాగు గ్రామంలో రైతు పడిగా ప్రశాంత్ ఏర్పాటు చేసిన సమీకృత వ్యవసాయ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో అమలు చేస్తున్న సమీకృత, ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఆయన పరిశీలించారు.ఈ సమీకృత వ్యవసాయ కేంద్రంలో ఆకుకూరలు, మునగతో పాటు వివిధ రకాల పండ్ల మొక్కలను పూర్తిగా డ్రిప్ ఇరిగేషన్ విధానంలో సాగు చేస్తున్న తీరును కలెక్టర్ ప్రశంసించారు. నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నందుకు రైతు పడిగా ప్రశాంత్‌ను అభినందించారు. అలాగే యూనిట్‌లో కొనసాగుతున్న కొర్రమీను చేపల పెంపకం, మేకల పెంపకం, బ్యాక్‌యార్డ్ మదర్ యూనిట్, డక్స్ యూనిట్‌లను కూడా పరిశీలించి, వాటి నిర్వహణపై రైతులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ తరహా సమీకృత వ్యవసాయ యూనిట్లు జిల్లాలోని ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తాయని కలెక్టర్ అన్నారు.అనంతరం మైలవరం గ్రామంలో రైతు మాడె కృష్ణవేణి ఏర్పాటు చేసిన కౌజు పిట్టల యూనిట్‌ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ యూనిట్‌ను కేవలం రూ.25,000/- తక్కువ పెట్టుబడితో షెడ్ నిర్మాణం, ఫెన్సింగ్, కౌజు పిల్లలు, ఫీడ్ మరియు అవసరమైన పరికరాలతో ఏర్పాటు చేసిన విధానాన్ని కలెక్టర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. తక్కువ పెట్టుబడితో గ్రామీణ మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఈ యూనిట్లను జిల్లాలో విస్తృతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని , జిల్లాలో ఈ విధంగా 500 కౌజు పిట్టల యూనిట్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అలాగే మైలవరo గ్రామానికి చెందిన యువ రైతు కుంజా సందీప్ అమలు చేస్తున్న ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విధానాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. అనేక రకాల సమీకృత పంటల సాగుతో పాటు జీవామృతం, పంచగవ్య వంటి సేంద్రియ ఎరువుల తయారీ యూనిట్లను పరిశీలించి, సేంద్రియ వ్యవసాయం ద్వారా నేల సారవంతత పెరిగి, సాగు ఖర్చులు తగ్గడంతో పాటు రైతులకు దీర్ఘకాలిక లాభాలు సాధ్యమవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా యువ రైతు కుంజా సందీప్‌ను కలెక్టర్ అభినందిస్తూ, సేంద్రియ సాగును మరింత విస్తృతంగా చేపట్టాలని పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ గ్రామంలోని యువ రైతులకు సమీకృత వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు సుజాతనగర్‌లోని రవి హైబ్రిడ్ సీడ్స్ కేంద్రాన్ని సందర్శించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ, సమీకృత వ్యవసాయ విధానం రైతులకు స్థిరమైన, నిరంతర ఆదాయాన్ని అందించే ఉత్తమ మార్గమని తెలిపారు. ఒకే వ్యవసాయ క్షేత్రంలో పంటల సాగుతో పాటు పశుపోషణ, పక్షుల పెంపకం, చేపల పెంపకం వంటి అనుబంధ కార్యకలాపాలను సమన్వయంతో చేపట్టడం వల్ల సాగులోని ప్రమాదాలు తగ్గి లాభాలు పెరుగుతాయని అన్నారు. డ్రిప్ ఇరిగేషన్ వంటి ఆధునిక సాగునీటి పద్ధతుల వినియోగంతో నీటి వృథా తగ్గి దిగుబడులు మెరుగుపడతాయని అన్నారు. తక్కువ పెట్టుబడితో కౌజు పిట్టల యూనిట్లు, బ్యాక్‌యార్డ్ యూనిట్లు, సేంద్రియ వ్యవసాయం వంటి కార్యక్రమాలు గ్రామీణ యువత, మహిళలకు మంచి ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని తెలిపారు. జిల్లాలో ఈ తరహా మోడల్ యూనిట్లను విస్తృతంగా ఏర్పాటు చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఏపీఎం వెంకయ్య,సంబంధిత శాఖల అధికారులు, స్థానిక రైతులు, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :