తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని జిఎం కార్యాలయంలో సోమవారం విజిలెన్స్ అవగాహనా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి.సంస్థలో పారదర్శకత, జవాబుదారీతనం మరియు సత్ప్రవర్తన పెంపొందించుట అనే లక్ష్యముతో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా నిర్వహించబడుతున్న విజిలెన్స్ అవగాహనా వారోత్సవాలలో భాగంగా మన సింగరేణి సంస్థలో అక్టోబర్ 27 నుంచి నవంబర్ 02 వరకు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.అదేవిధంగా మన కొత్తగూడెం ఏరియాలో విజిలెన్స్ అవగాహనా వారోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏరియా జనరల్ మేనేజర్, ఎం. షాలేం రాజు హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సింగరేణి ఉద్యోగులందరూ నీతి, నిజాయితీ మరియు నిబద్దతతో పని చేయాలని అన్నారు. సింగరేణిలో ఐటి ఆధారిత సిస్టమ్స్ ద్వారా అవినీతికి తావులేకుండా నిర్మూలించడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. అలాగే కొత్తగూడెం ఏరియా లో ప్రతి ఒక్కరూ లాలూచి పడకుండా, కచ్చితమైన నియమ నిబంధనలు పాటిస్తూ అవినీతి నిర్మూలనకు కృషి చేస్తూ సంస్ధ పురోగాభివృద్దికి పాటుపడాలన్నారు. ప్రతీ ఫైల్ ను కూడా అలసత్వంతో ఆలస్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశిస్తూ కొత్తగూడెం ఏరియాని అవినీతి రహిత ఏరియాగా తీర్చిదిద్దాలని అందుకు అందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ప్రతి సంస్ధకు ఉత్పత్తి, లాభాలు, భద్రత, సంక్షేమంతో పాటు సంస్థలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా పారదర్శికంగా అవినీతి రహితముగా విధులు నిర్వహించడం అత్యంత ముఖ్యమైన అంశమని అందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. “జాగరూకత : మా భాగస్వామ్య బాధ్యత (Vigilance: Our Shared Responsibility)” అనునది ఈ సంవత్సర విజిలెన్స్అవగాహన వారోత్సవాల నినాధము అని తెలిపారు. ఈ సందర్భంగా డిజిఎం (పర్సనల్) జి.వి. మోహన్ రావు ఉద్యోగులందరిచే అవినీతి నిర్మూలన ప్రతిజ్ఞ చేపించారు. అదే విదముగా కొత్తగూడెం ఏరియా లోని అన్ని గనులు మరియు డిపార్ట్మెంట్లలో కూడా ఆయా గనుల మేనేజర్లు మరియు అధిపతులు ఉద్యోగులందరిచే అవినీతి నిర్మూలన ప్రతిజ్ఞ చేపించారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా ఏఐటియూసి యూనియన్ ప్రతినిధి ఉమాయిన్, ఐఎన్‌టియూసి వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్, ఎస్ఓటు జిఎం జి.వి. కోటి రెడ్డి, డిజిఎం (పర్సనల్) జి.వి. మోహన్ రావు, ఇతర విబాగల అధిపతులు, అధికారులు మరియు జిఎం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ