Sunday, 02 August 2026 09:33:58 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

తల్లిదండ్రుల అవగాహనతోనే సమాజంలో మార్పు – కమిషనర్ సీతా దయాకర్ రెడ్డి

Date : 09 April 2026 04:43 PM Views : 185

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బాలల భద్రత, విద్య, ఆరోగ్యం అందేలా సమగ్ర చర్యలు – కలెక్టర్ అంకిత్ చైల్డ్ రైట్స్‌పై ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్షా సమావేశం నిర్వహణ ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమ కార్యక్రమాల అమలు, బాలల భద్రతపై సమగ్ర సమీక్ష నిర్వహించేందుకు బాలల హక్కులపై సమీక్ష సమావేశం గురువారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరం లో నిర్వహించబడింది. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలల హక్కుల కమిషనర్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రుల అవగాహనతోనే సమాజంలో మార్పు సాధ్యమని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో మత్తు పదార్థాల నియంత్రణ, మరుగుదొడ్ల వినియోగం, బాల్య వివాహాల నివారణ, లింగ నిర్ధారణ కేసుల అరికట్టడంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి కమిషన్‌కు తెలియజేస్తే తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు పిల్లల ఎదుగుదలకు కీలకమని పేర్కొంటూ పోషకాహారం, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా ములకలపల్లి ధర్మన్న నగర్‌లో అంగన్వాడీ కేంద్రం లేకపోవడం గమనించామని, అటవీ శాఖ అనుమతుల సమస్యల కారణంగా పిల్లలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అవసరమైతే కంటైనర్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సీజన్ సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే వ్యవసాయ కూలీల పిల్లల సమస్యల పరిష్కారానికి అంతర్రాష్ట్ర స్థాయిలో సమన్వయం అవసరమని తెలిపారు .

జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ బాలల భద్రత, విద్య, ఆరోగ్యం అందేలా సమగ్ర చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో బాలసదన్ ద్వారా పిల్లల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, 1098 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పిల్లల సమస్యలపై తక్షణ స్పందన అందిస్తున్నామని చెప్పారు. అంగన్వాడీ నుండి కళాశాల స్థాయి వరకు మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో పదో తరగతి ఉత్తీర్ణతలో బాలికలు ముందంజలో ఉన్నారని, గిరిజన ఆశ్రమ పాఠశాలలతో పాటు అన్ని పాఠశాలల్లో పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ 23 తరువాత బడిబాట కార్యక్రమం ద్వారా మారుమూల ప్రాంతాల్లో డ్రాప్ అవుట్‌లపై ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు . పాఠశాలలు, కళాశాలల పర్యవేక్షణ కోసం మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకంపై క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తూ సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో సికిల్ సెల్ అనీమియా నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి హెల్త్ క్యాంపుల ద్వారా కేసులను గుర్తించి వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో బాల్య వివాహాల నివారణతో పాటు గంజాయి, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ జిల్లాలో నమోదైన పోక్సో, బాల్య వివాహ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో గిరిజన అటవీ ప్రాంతాల్లో గంజాయి రవాణా, వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాల ద్వారా గల్లంతైన పిల్లలను గుర్తించి రక్షణ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.ఈ సందర్భంగా 2023, 2024, 2025 సంవత్సరాలలో జిల్లాలో నమోదైన పోక్సో, బాల్య వివాహాలు తదితర కేసుల వివరాలను సమగ్రంగా వివరించారు. ఈ సమావేశంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు బాలల హక్కుల పరిరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిషన్‌కు వివరించారు. బాలల హక్కుల పరిరక్షణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రతి బాలుడికి సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు కట్టుబడి పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల ద్వారా బాలల హక్కుల పరిరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలు, తీసుకోవలసిన చర్యలపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, కమిటీ మెంబర్లు కంచికచర్ల వందన గౌడ్, చందన, అపర్ణ, గోగుల సరిత, ప్రేమలత, వచన్ కుమార్, భరత రాణి, సుమిత్ర దేవి, సాధిక్ భాష, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని స్వర్ణలత లెనినా, ఖమ్మం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి విజేత, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :