తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ది.02-04-2028 గురువారం నాడు శ్రీ సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ వర్ధంతిని పురస్కరించుకొని అదనపు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ ఆద్వర్యంలో జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్ ఐ.డి.ఒ.సి. భద్రాద్రి కొత్తగూడెం నందు ఉ॥11:00 ని॥లకు కార్యక్రమము ఏర్పాటు చేసినారు. శ్రీ సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ చిత్రపటమునకు పూల మాలను వేసి కార్యక్రమమును ప్రారంభించినారు, తదుపరి సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ జీవిత చరిత్ర మన పిల్లల, భావితరాల వారికి తెలియజేయాలని కులవృత్తిని ప్రోత్సహకరంగా సాగే సూచనలు చేయడం జరిగినది. ప్రభుత్వం అందించే ఫలాలను గ్రామ స్థాయి వరకు సమాచారం అందించాలని తెలియజేసినారు. ఈ కార్యాక్రమంలో శ్రీ బండి రాజుగౌడ్, శ్రీ బుర్ర ధన్రాజ్ గౌడ్ , కమ్మగారని శంకర్ గౌడ్, పాసిని వెంకన్నగౌడ్, బొమ్మగాని రమేష్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, సరేష్ గౌడ్ మరియు పి. విజయలక్ష్మి, కన్వీనర్/ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి, కార్యాలయ సిబ్బంది కార్యాక్రమంలో పాల్గొన్నారు. తదుపరి పలువురు బి.సి. నాయకులు ప్రసంగించినారు,
Admin
తెలుగు వెలుగు టీవీ