తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 7(తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలంలోని ప్రజలు ప్రతి గ్రామంలో (భాద్రపద శుద్ధ చవితి) వినాయక చవితి పర్వదిన నవరాత్రి పూజా కార్యక్రమాలు నిర్వహించారు మొదటిరోజు బక్తి శ్రద్ధలతోపూజ కార్యక్రమాలు నిర్వహించారు. భాద్రపద శుద్ధ చవితిన వినాయకుడు జన్మించాడని ఇదే రోజున గణాధిపత్యం సాధించాడని. పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. మండలం లోని పడమటి నర్సాపురం రామాలయంలో, కాకర్ల ఆంజనేయస్వామి గుడి నందు పాపుకొల్లు గ్రామంలో శ్రీ ఉమా సోమలింగేశ్వర స్వామి ఆలయం, అనంతారం గ్రామంలో నూతనంగా నిర్మించిన అభయాంజనేయ స్వామి దేవాలయం నందు యువకులు కమిటీలు నిర్మించుకొని విగ్నేశ్వరుని నవరాత్రి కార్యక్రమాలు చేపట్టారు
Admin
తెలుగు వెలుగు టీవీ