తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా SP రోహిత్ రాజు IPS ఆదేశాల మేరకి కొత్తగూడెంలో ఉన్నటువంటి సింగరేణి స్కూల్ లో డ్రగ్స్ వలన కలిగే నష్టాలు,పోక్సో చట్టం పై, మహిళలపై, పిల్లలపై జరిగే నేరాలపై , అవగాహన కల్పించి వాటిని నివారించడంలో షీ టీమ్, AHTU పోలీస్,భరోసా, చైల్డ్ హెల్ప్ లైన్ పాత్రని తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమలో షీ టీం & AHTU SI రమాదేవి మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగించిన, కొన్నా, అమ్మినా, తీసుకోమని ప్రోత్సహించిన, ట్రాన్స్పోర్ట్ చేసిన వారిపైన కఠిన చర్యలు తీస్కుంటామని,మహిళలని, పిల్లలని ఎవరైనా ఏ విదంగాఅయినా ఇబ్బంది పెట్టినా షీ టీమ్ ని నిర్భయంగా సంప్రదించాలని కోరారు, బాధితుల వివరాలు పూర్తిగా గొప్యంగా ఉంచబడును అని తెలిపారు,18 yrs నిండని పిల్లలపై ఏదైనా ఆగాత్యానికి పాల్పడితే పోక్సో చట్టం ద్వారా కఠినమైన చర్యలు తీస్కుంటామని తెలిపారు మహిళలు, పిల్లలు కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే కొత్తగూడెం షీ టీమ్ ఫోన్ no 8712682131కి కాల్ చేయగలరు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ టీచర్స్, షీ టీమ్ ASI నాగయ్య, పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ