తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అనుబంధాలకు ప్రతీక రాఖీ పండుగ.సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడాలి.కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేద్దాం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.అనుబంధాలకు, ఆప్యాయతలకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ మన సమాజంలో విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రాఖీ పౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని కొత్తగూడెంలోని ఆయన నివాసంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల మహిళా ప్రతినిధులు, బ్రహ్మకుమారీస్ సభ్యులు ఆయనను కలిసి రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. శ్రావణమాసంలో వచ్చే ఈ పండుగ మానవ సంబంధాలను, కుటుంబ విలువలను గుర్తుచేస్తుందన్నారు. బాధ్యతల నిర్వహణలో ఎంత దూరంలో ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చే గొప్ప సంస్కృతి మన దేశంలో ఉందని పేర్కొన్నారు. సమాజంలో సోదరభావం, ఐక్యత వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. తనకు రాఖీ కట్టి ఆశీస్సులు అందించిన బ్రహ్మకుమారీస్ సభ్యులకు, మహిళా సమాఖ్య నాయకురాళ్లకు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ