Wednesday, 16 September 2026 09:06:14 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

జనసేన పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధిగా డా. గడల శ్రీనివాసరావు నియామకం.

Date : 21 August 2026 05:29 PM Views : 157

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జనసేన పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధిగా డా. గడల శ్రీనివాసరావు నియామకం.జనసేన పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధిగా (Official Spokesperson) తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్, పార్టీ రాష్ట్ర నాయకులు డా. గడల శ్రీనివాసరావు నియమితులయ్యారు.తనపై విశ్వాసం ఉంచి ఈ కీలక బాధ్యతను అప్పగించిన జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి డా. గడల శ్రీనివాసరావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ: జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా నాకు అప్పగించిన బాధ్యతను ఎంతో వినమ్రతతో, నిబద్ధతతో స్వీకరిస్తున్నాను. పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, ప్రజా సమస్యలపై పార్టీ వైఖరిని స్పష్టంగా, హుందాగా, బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నా శక్తివంచన లేకుండా కృషి చేస్తాను.” అని తెలిపారు.ప్రజాసేవే తన రాజకీయ ప్రయాణానికి ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, “బాధ్యత మారవచ్చు… కానీ నా లక్ష్యం ఒక్కటే ~ ప్రజలే ప్రథమం, ప్రజాసేవే పరమావధి” అని స్పష్టం చేశారు.తెలంగాణలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రజా సమస్యలను నిరంతరం వెలుగులోకి తీసుకువస్తూ, పార్టీకి–ప్రజలకు మధ్య బలమైన వారధిగా పనిచేస్తానని డా. గడల శ్రీనివాసరావు తెలిపారు.తనపై నమ్మకం ఉంచిన పవన్ కళ్యాణ్ కి, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరికి, పార్టీ నాయకత్వానికి, అలాగే తనకు నిరంతరం అండగా నిలుస్తున్న జనసైనికులు, వీర మహిళలు, పార్టీ శ్రేణులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :