Sunday, 02 August 2026 03:40:23 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు.

Date : 27 July 2026 10:57 AM Views : 103

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావడం, పంటల దిగుబడిని పెంచడం లక్ష్యంగా " విత్తన మేళా–2026 " కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్-నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకుని, వ్యవసాయ శాఖ సూచించిన పంటలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం గుర్తించిన విత్తన విక్రయ కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేపట్టడం ద్వారా మెరుగైన దిగుబడులు సాధించవచ్చన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మండలాల వారీగా ఏర్పాటు చేసిన విత్తన విక్రయ కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. విత్తనాల కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, విత్తనాల ప్యాకెట్‌పై బ్యాచ్ నంబర్, గడువు తేదీ, మొలక శాతం తదితర వివరాలను పరిశీలించాలని సూచించారు.రైతులు తమ ప్రాంతంలోని వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి స్థానిక పరిస్థితులకు అనువైన పంటలను ఎంపిక చేసుకోవాలని కోరారు. కంది, పెసర, మినుము, శనగ, జొన్న, సజ్జ, కొర్రలు తదితర పప్పుధాన్యాలు, చిరుధాన్యాల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని తెలిపారు.నకిలీ విత్తనాల బారిన పడకుండా ప్రభుత్వం గుర్తింపు పొందిన లైసెన్స్ కలిగిన విక్రయ కేంద్రాల నుంచే విత్తనాలను కొనుగోలు చేయాలని, విత్తనాల కొనుగోలు అనంతరం బిల్లు భద్రపరచుకోవాలని సూచించారు. విత్తనాలకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా ఫిర్యాదులు ఉంటే వెంటనే సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించాలని తెలిపారు.ప్రతి రైతు "విత్తన మేళా–2026"ను సద్వినియోగం చేసుకుని నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు ఆకాంక్షించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :