తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గత 30 సంవత్సరాల నుండి బండారు ఎల్లయ్య గారితో ఉమ్మడి ఖమ్మం జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేయబడి ఎంతోమంది విద్యార్థులను రాష్ట్రస్థాయి నుండి దేశ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్ది వారికి రైల్వే, పోలీస్, ఆర్మీ మరియు ఇతర రంగాల్లో స్థిరపడడానికి బాక్సింగ్ ఎంతో ఉపయోగపడింది ముఖ్యంగా కొత్తగూడెం జిల్లా నుండి చాలామంది క్రీడాకారులు బాక్సింగ్ ద్వారా వివిధ రంగాల్లో స్థిరపడి ఉన్నారు. బండారి ఎల్లయ్య గారి సహకారం వలన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాక్సింగ్ సంఘం ఏర్పాటుకు తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ వారిచే'ఆఫిలియేషన్' పొంది భద్రాద్రి కొత్తగూడెం బాక్సింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది. ఈ జిల్లా కమిటీ యొక్క వివరాలు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సంఘ చైర్మన్ గా లగడపాటి రమేష్, అధ్యక్షులుగా ఉదయ్ కాంత్, కార్య నిర్వాహక అధ్యక్షులుగా ఎం. రాజయ్య, ప్రధాన కార్యదర్శిగా వై. శివ సుబ్రహ్మణ్యం, ముఖ్య సలహాదారులుగా జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అయిన కె.సంజీవరావు గారు,మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అధికారి అయిన సంగం వెంకట పుల్లయ్య గారు,టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షులు అమరనేని రామారావు గారు, ఎల్టా జిల్లా అధ్యక్షులు దస్తగిరి గారు,చీఫ్ పాట్రన్ గా హైకోర్టు అడ్వకేట్ అయిన యెర్రా కామేష్ గారు, జవహర్ రెడ్డి గారు,మిత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్... ఉపాధ్యక్షులుగా షమివుద్దిన్, శ్రీకాంత్,రమేష్, శంకర్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఈశ్వర్, జాయింట్ సెక్రెటరీస్ గా ధారా నగేష్, అరుణ్ కుమార్, కన్నయ్య, శ్రీమూర్తులు,లీగల్ అడ్వైజర్ గా మారపాక రమేష్,ట్రెజరీగా రవీందర్,ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా మహేందర్, రతన్ సింగ్,దుర్గ,కిరణ్ కుమార్,శ్రీనివాస్,నవీన్ యశ్వంత్ గా జిల్లా కమిటీలో ఉన్నారు.. ఈ సందర్భంగా జిల్లా కమిటీ మొదటి సమావేశం నిర్వహించడం జరిగింది .ఈ సమావేశంలో జిల్లా చైర్మన్ మరియు చీప్ పాట్రన్ అయినా లగడపాటి రమేష్ మరియు యెర్రా కామేష్ మాట్లాడుతూ గ్రామీణ యువతి యువకులకు ఈ బాక్సింగ్ పట్ల సరియైన అవగాహన లేక ఈ అమూల్యమైన బాక్సింగ్ విద్యను నేర్చుకోలేక పోతున్నారు కావున వారికి అవగాహన కల్పిస్తామన్నారు.బాక్సింగ్ పట్ల ఆసక్తి కలిగిన యువతీ యువకులకు వేసవి కాలంలో ఉచిత బాక్సింగ్ శిక్షణ నిర్వహిస్తామని, బాక్సింగ్ ను నేర్చుకోవాలనుకుంటున్న క్రీడాకారులకు బాక్సింగ్ సామాగ్రిని ఉచితంగానే అందిస్తామని,క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ లక్ష్యం అని చెప్పారు. వేసవి కాల ఉచిత శిక్షణలో ఎన్ ఐ ఎస్ శిక్షణ పొందిన ఈశ్వర్ మరియు జాతీయ స్థాయిలో బాక్సింగ్ లో బంగారు పతకం సాధించిన శివ సుబ్రహ్మణ్యం శిక్షకులుగా ఉంటారన్నారు. ప్రస్తుతము నేతాజీ వ్యాయామశాలలో శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ అవకాశాలను క్రీడాకారులు వినియోగించుకోవాలని కోరడం జరిగింది.ఈ సమావేశంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు రాజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి శివ సుబ్రహ్మణ్యం, జిల్లా ఉపాధ్యక్షులు శమీ ఉద్దీన్ పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ