తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : జులై 9న జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపుకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం సత్తుపల్లి జేవిఆర్ ఓసీలో ఏర్పాటు చేసిన కార్మిక యూనియన్ల జేఏసీ సమావేశంలో మాట్లాడారు. కార్మికుల హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ సమ్మెతో కనువిప్పు కలగాలని చెప్పారు. 44 కార్మిక చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్ లుగా మార్చడాన్ని వ్యతిరేకించారు. కార్పొరేట్ సంస్థలకు కార్మికులను కట్టు బానిసలుగా మార్చే కుట్రను ఖండించాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు మరియు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు సెంట్రల్ కమిటీ మెంబర్ ఈశ్వర్, ఫిట్ సెక్రెటరీ పిచ్చయ్య, జి.ఎస్ శ్రీనివాస్, ఆంజనేయులు, బ్రాంచ్ సెక్రటరీలు, చంద్రశేఖర్, తిరుపతి, అశోక్, పి పి రాజు, సాగర్, కాజా భక్ష, పూర్ణ, పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ