తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈ.ఆర్.ఓలతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ, 2002 ఎలక్టోరల్ జాబితాతో నియోజకవర్గాల వారిగా 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి 4 కేటగిరీలుగా విభజించడం జరిగిందని తెలిపారు. మొదట కేటగిరి "ఎ" జాబితాను బి ఎల్ ఓ యాప్ ద్వారా నిర్ధారించుకోవడం జరుగుతుందని, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల ఓటర్లను నిర్ధారించడం జరిగిందని, మిగిలిన 12 లక్షల ఓటర్ల నిర్ధారణ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కేటగిరి సి, క్యాటగిరి డి లలోని ఓటర్లను కేటగిరి ఎ కు మ్యాపింగ్ చేసే ప్రక్రియను మెరుగుపరచాలని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, ఎన్నికల సూపర్డెంట్ రంగ ప్రసాద్ మరియు సంబంధిత శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ.. స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ సన్నాహక ప్రక్రియ ను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ