Thursday, 05 November 2026 03:01:44 AM
# సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు.

- టీఎస్ జేయు ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచిత ప్రమాద బీమా పత్రాలు అందజేత

Date : 07 February 2025 06:35 PM Views : 900

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : టీ.ఎస్.జే.యు రాష్ట్ర అధ్యక్షుడు నారగోని పురుషోత్తం గౌడ్ ఆధ్వర్యంలో వరంగల్ టీఎస్ జేయు యూనియన్ సభ్యులందరికీ ఐదు లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని అందజేశారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో దీనికి సంబంధించిన బీమా పత్రాలను జిల్లా కలెక్టర్ సత్య శారదా చేతుల మీదుగా సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిత్యం విధి నిర్వహణలో భాగంగా ఎంతో మంది జర్నలిస్టులు ప్రమాదాలకు గురై ఇబ్బందులు పడుతుంటారు. ఆ సమయంలో వీరికి ప్రమాద బీమా ఎంతగానో ఉపయోగపడుతుంది అని అన్నారు. టీఎస్ జెయు ఆధ్వర్యంలో జర్నలిస్టులందరికీ ప్రమాద బీమా కల్పించడం నిజంగా అభినందించదగ్గ విషయం అని అన్నారు. కార్యక్రమంలో టీఎస్ జేయు రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం గౌడ్ నారగోని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, సహాయ కార్యదర్శి రావుల నరేష్, జిల్లా అధ్యక్షులు కందికొండ మోహన్, ప్రధాన కార్యదర్శి ఆవునూరి కుమారస్వామి, ఉపాధ్యక్షులు లింగబత్తిని కృష్ణ, కందికొండ గంగరాజు, ఈద శ్రీనాథ్, బత్తుల సత్యం, సభ్యులు కౌడగాని మోహన్ రావు, నీరుటి శ్రీహరి, అడుప అశోక్, మంతెన సురేష్, అవినాష్, బొక్క రాజు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :