తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బతుకమ్మ చీరలు మహిళలందరికీ అందించాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యురాలు, మహిళా సంగం నాయకురాలు మునిగడప పద్మ ప్రజా ప్రభుత్వానికి నేడు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఒక్క డ్వాక్రా గ్రూపు మహిళలకు మాత్రమే చీరలు ఇస్తామంటే మిగతా మహిళల ల సంగతి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. 60 సంవత్సరాలు దాటిన మహిళలు డ్వాక్రా గ్రూపు నుండి తప్పించడం జరిగిందని అలాగే గ్రూపులో సభ్యులుగా లేని మహిళలు చాలామంది ఉన్నారని అన్నారు. పండుగ పూట మిగతా మహిళలు బాధపడే అవకాశం ఉందని తక్షణమే ప్రభుత్వం పునరా ఆలోచన చేసి గతంలో మాదిరిగానే మహిళలందరికీ నాణ్యమైన బతుకమ్మ చీరలు పంపిణీ చేసి ప్రజా ప్రభుత్వం మహిళలపై ఉన్న గౌరవాన్ని చాటుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ