తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవ సభను కొత్తగూడెం పట్టణంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి సాబీర్ పాష పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం రజాకార్లను ఎదుర్కొని అనేకమంది తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేశారన్నారు. వారి ఫలితంగా పేద ప్రజలకు ఉచితంగా భూ పంపిణీ జరిగిందని ఆయన అన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ