Monday, 03 August 2026 12:48:03 PM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి - జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

Date : 30 January 2026 05:50 PM Views : 154

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగటానికి ఇప్పటి నుంచే కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో సోహన్ అకాడమీ మరియు విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించిన "మీట్ ద కలెక్టర్" కార్యక్రమంలో మాట్లాడుతూ, విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా వారి చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలకు సాంకేతికత ఆధారంగా పరిష్కారాలు కనుగొనాలని, ఆ పరిష్కారాలు ఆచరణ యోగ్యంగా ఉండి ఎవరైనా స్వల్ప పెట్టుబడితో తయారు చేసుకునే విధంగా ఉండాలని సూచించారు. ఇలా తయారు చేసే క్రమంలోనే శాస్త్రవేత్తలు ఆవిర్భవిస్తారని, వారే దేశ ప్రజల ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపగలుగుతారని పిల్లలకు ఉద్బోధించారు. పిల్లలు తయారు చేసిన వివిధ రకాల రోబోటిక్ ఎగ్జిబిట్లను పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు. రైతులు పంటలు పండించడానికి ఎదుర్కొనే సమస్యలు, ఇళ్లలో కోతుల సమస్యలు, దొంగల నుండి ఇంటిని రక్షించుకోవడానికే అవసరమైన వ్యవస్థలు, ఇటువంటి నిత్య జీవిత సమస్యలకు ఆచరణ యోగ్యమైన పరిష్కారాలు కనుగొనాలని పిల్లలకు తెలిపారు. సోహన్ అకాడమీ వారు జిల్లాలోని గుర్తించిన 13 పీఎం శ్రీ పాఠశాలల్లో వర్క్ షాప్ లు నిర్వహించి పిల్లలకు రోబోటిక్స్ పై అవగాహన కల్పించడం నిజంగా అభినందనీయమని అన్నారు. సోహన్ అకాడమీ డైరెక్టర్ సహదేవ్ మాట్లాడుతూ ఇప్పటివరకు 32 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశామని, కానీ భద్రాద్రి జిల్లాలో లభించిన ఆదరణ ఏ జిల్లాలోనూ లభించలేదని దీనికి కారణమైన కలెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి బి.నాగలక్ష్మి మాట్లాడుతూ అటల్ టింకరింగ్ ల్యాబ్ పథకంలో భాగంగా పీఎం శ్రీ పాఠశాలలకు అందించిన పరికరాలను ఎలా వినియోగించాలో ఉపాధ్యాయులకు విద్యార్థులకు కూడా అవగాహన కల్పించిన సోహన్ అకాడమీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కనపరచిన పాఠశాలలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి బి. నాగలక్ష్మి, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ నాగరాజ శేఖర్, సమ్మేళిత విద్యా కోఆర్డినేటర్ ఎస్కే సైదులు, ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, సోహన్ అకాడమీ ఫౌండర్ డైరెక్టర్ సహదేవ్, మరియు వారి బృందం తో పాటు ఎన్నిక చేసిన 13 పీఎం శ్రీ పాఠశాల నుండి విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :