తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : టేకులపల్లి మండలం కొండగులబోడు గ్రామానికి చెందిన భూక్యా వినోద్ (28) ఆదివారం ఆత్మహత్య కు పాల్పడ్డాడు. కొత్తగూడెం హోండా షోరూంలో వినోద్ పని చేస్తున్నాడు. సెలవు దినం కావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెప్పారు. వ్యవసాయ పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు కొడుకు ఉరి వేసుకుని విగత జీవిగా కనిపించాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Admin
తెలుగు వెలుగు టీవీ