Thursday, 05 November 2026 03:01:44 AM
# సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు.

కాన్సీరామ్ ఆశయ సాధనకు కృషి చేయాలి* బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

Date : 09 October 2024 09:22 PM Views : 497

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : * *కొత్తగూడెం*: బహుజన ఉద్యమ సిద్ధాంత కర్త,రాజకీయ వ్యూహకర్త,బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యులు కాన్షీరామ్ 18వ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక కొత్తగూడెం క్లబ్ లో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ పాల్గొని కాన్సీరామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశ రాజకీయ వ్యవస్థలో పెను మార్పులు సాధించిన బహుజన యోధుడు,బహుజన రాజ్యాధికార స్వాప్నికుడు కాన్షీరామ్ అని,బహుజన మహనీయులైన జ్యోతిరావు పూలే,ఛత్రపతి సాహుజీ మహారాజ్,శ్రీ నారాయణ గురు,పెరియార్ రామస్వామి నాయకర్,బాబా సాహెబ్ అంబేద్కర్ ల పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని బహుజన రాజ్యాధికార సిద్ధాంతాన్ని రూపొందించి 14 ఏప్రిల్ 1984లో బహుజన్ సమాజ్ పార్టీ స్థాపించారని,తద్వారా అధికారానికి దూరంగా ఉన్న బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలైన బహుజనులకు ఉత్తరప్రదేశ్ లో అధికారం రుచి చూపించారని,ఆత్మగౌరవం కోసం,విముక్తి కోసం,అసమానత్వం,అన్యాయం,అణగారిన వర్గాలపై దాడులకు వ్యతిరేకంగా,అంటరానితనానికి వ్యతిరేకంగా,సమాజంలో సోదర భావం నింపుతూ కుల నిర్మూలన కోసం పోరాడిన మహనీయుడు కాన్సీరామ్ అని కొనియాడారు.బహుజన మహా పురుషుల చరిత్రను వారి పోరాటాలను దేశవ్యాప్తంగా సైకిల్ ర్యాలీలు నిర్వహించి చైతన్య పరిచారని,సామాజిక పరివర్తన కోసం పరితపించారని నేటి యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని,కాన్సీరామ్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో *జిల్లా ఉపాధ్యక్షులు కాంపాటి నరేష్,జిల్లా ప్రధాన కార్యదర్శి వీరు నాయక్,జిల్లా కోశాధికారి పీక మల్లికార్జునరావు,కొత్తగూడెం,ఇల్లందు,పినపాక నియోజకవర్గ అధ్యక్షులు నాగుల రవికుమార్,అజ్మీరా వెంకన్న,సత్య వరప్రసాద్* తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :