తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పూజలకు మట్టితో తయారుచేసిన విగ్రహాలను మాత్రమే ఉపయోగించాలని, పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వినియోగించవద్దని ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్ పిలుపునిచ్చారు.రెండు వేరువేరు కార్యక్రమాల్లో పాల్గొన్న విశ్వామిత్ర చౌహాన్ మొదటగా పాల్వంచలో గ్రీన్ ఎర్త్ సొసైటీ ఆధ్వర్యంలో సొసైటీ అధ్యక్షులు రమేష్ రాథోడ్ గారి ఆధ్వర్యంలో జరిగిన 1000కి పైగా మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం తన ప్రతిరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా 1564వ మొక్కగా భజన మందిరం ఆవరణంలో కదంబ మొక్కను నిర్వాహకులతో కలిసి నాటారు.అనంతరం పాల్వంచ దమ్మపేట సెంటర్లో కొత్తగూడెం నగరపాలక సంస్థ మేయర్ ఆధ్వర్యంలో జరిగిన 500 మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ తో కలిసి పాల్గొని మట్టి గణపతి విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాల్లో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, గ్రీన్ ఎర్త్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ