తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మణుగూరు మండలం బాంబే కాలనీ సమీపంలోని రేగుల గండి చెరువులో సింగరేణి ఉద్యోగి సుంకరి శ్రీనివాస్ స్నేహితులతో ఈతకు వెళ్లి బుధవారం గల్లంతయ్యారు. గురువారం NDRF బృందాలు, రెస్క్యూ టీం సాయంతో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం మృతదేహం లభ్యమైంది. శ్రీనివాస్ మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Admin
తెలుగు వెలుగు టీవీ